Begin typing your search above and press return to search.
మాలీవుడ్ ఓటీటీ ని కావాలనే నిర్లక్ష్యం చేస్తుందా?
By: Tupaki Desk | 28 May 2023 7:00 PMమాలీవుడ్ పరిశ్రమ ఇప్పుడు పాన్ ఇండియా లో గుర్తింపు దక్కించుకుంది. అక్కడి కంటెంట్ కి ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. ఇతర భాషల్లో సైతం మాలీవుడ్ సినిమాలు రీమేక్ అవుతున్నాయి. అందులో టాలీవుడ్ పరిశ్రమ ముందు వరుసలో ఉంది. సినిమా హిట్ అయితే చాలు తెలుగు స్టార్ హీరో ఎవరో ఒకరు రీమేక్ చేస్తున్నారు. '2018'..'ది కేరళ స్టోరీ' లాంటి సినిమాలు నేరుగా తెలుగు రాష్ట్రాలు సహా వివిధ రాష్ట్రాల థియేటర్లోనే రిలీజ్ అయ్యాయంటే? అక్కడి సినిమాల కు ఎంతగా ప్రాధాన్యత సంతరించుకుందో అర్ధమవుతుంది.
అక్కడి నటులు ఇతర భాషల్లో నూ అవకాశాలు అందుకుటున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? మాలీవుడ్ కంటెంట్ ఇంతగా వైరల్ సెన్షేషన్ అవ్వడానికి కారణ ఏంటి? ఏంటి అంటే కచ్చితంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ అనే చెప్పాలి. ఓటీటీ బూమ్ కారణంగా మలయాళ సినిమా పాన్ ఇండియాలో గుర్తింపు పొందింది. మలయాళం మాట్లాడే ప్రేక్షకులు.. అది తెలుగు.. తమిళం లేదా హిందీ ప్రేక్షకులు కావచ్చు. అంతా మలయాళ చిత్రాల ను ఉపశీర్షికలతో వివిధ ఓటీటీ ప్లాట్ ఫారమ్ లలో వీక్షించిన తర్వాత ఎంతో మంది నటులు ఇతర భాషల్లో ఫేమస్ అవుతున్నారు.
ఫహాద్ ఫాసిల్.. టోవినో థామస్ వంటి చాలా మంది మలయాళ తారలు తమ చిత్రాలను ఓటీటీ లో వీక్షించడం వల్ల ప్రజాదరణ పొందారు. కానీ అదే మాలీవుడ్ పరిశ్రమ ఇప్పటివరకూ ఒక్క ఓటీటీ సినిమా గానీ...వెబ్ సిరీస్ గానీ చేసింది లేదు. చేసిన సినిమా ఏదైనా సరే థియేటర్లో రిలీజ్ అవ్వాలి. ఆ తర్వాత అనువాదం..రీమేక్ రూపంలో ఇతర భాషల్లోకి వెళ్లాలి తప్ప! ఓటీటీ రిలీజ్ వద్దే వద్దు అన్నట్లు కనిపిస్తుంది.
దీంతో మాలీవుడ్ పరిశ్రమ ఓటీటీ ని ఎంతగా నిర్లక్ష్యం చేస్తుందో అద్దం పడుతుంది. తెలుగు.. తమిళం.. కన్నడం అన్ని సినిమాలు థియేటర్ తో పాటు ఓటీటీ వెసులు బాటు ఉంది. అలాగే హిందీ సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. మరి మాలీవుడ్ నుంచి ఓటీటీ సినిమాలు ఎందుకు రానట్లు? అక్కడ లెక్క ఏంటి? అన్నది ఆసక్తికరం.