Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో ఫోన్ వాడ‌ని ఏకైక స్టార్ హీరో?

By:  Tupaki Desk   |   15 May 2020 9:15 AM IST
టాలీవుడ్ లో ఫోన్ వాడ‌ని ఏకైక స్టార్ హీరో?
X
చ‌ర‌వాణి (ఫోన్) అనేది జీవితంలో భాగం అయిపోయింది ఎపుడో. ప్ర‌తిదానికీ ఫోన్ తోనే ప‌ని ప‌డుతుంది. ప్ర‌పంచం కుగ్రామంగా మారిపోయిన నేటి రోజుల్లో ఫోన్ చేతిలో లేక‌పోతే కాళ్లు రెండూ విర‌గ్గొట్టుకున్న‌ట్టే. అయితే జ‌నం అంత ఇంపార్టెంట్ వ‌స్తువుగా భావించే ఆ ఫోన్ విష‌యంలో అస్స‌లు ఏమాత్రం ప‌ట్టించుకోని హీరోలు కూడా ఉంటారా? అంటే.. అవున‌నే స్టార్ హీరో మ‌హేష్ షాకిచ్చారు. అస‌లు త‌న‌కు ఫోన్ ఎప్పుడూ చేరువ‌గా ఉండ‌ద‌ని.. తాను అస్స‌లు పట్టించుకోన‌ని అనేశారు.

అస‌లింత‌కీ ఏ సంద‌ర్భంలో అంటే.. ఒకానొక ముఖాముఖి ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్ సుమ అడిగిన ఓ ప్ర‌శ్న‌కు మ‌హేష్ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. ర్యాపిడ్ ఫైర్ క్వ‌శ్చ‌న్స్ అంటూ సుమ తొలిగా ఒక ప్ర‌శ్న అడిగారు. ``అస‌లు మీ ఫ‌స్ట్ ఎస్.ఎం.ఎస్ గుర్తుందా?`` అనేది ఆ ప్ర‌శ్న‌. దానికి మ‌హేష్ స‌ర్ ప్రైజింగ్ గానే ఆన్స‌ర్ ఇచ్చారు. ``అస్స‌లు గుర్తు లేదు`` అనేశారు. అస‌లు నేను షూటింగ్ లో ఉన్న‌ప్పుడు మా ఆవిడ ఫోన్ చేసినా .. నా మేక‌ప్ ఆర్టిస్ట్ కానీ డ్రైవ‌ర్ కానీ ఫోన్ ఇస్తేనే నేను మాట్లాడ‌తాను. నా ద‌గ్గ‌ర ఫోన్ ఉండ‌దు. అందువ‌ల్ల ఎస్.ఎం.ఎస్ ఏం తెలుస్తుంది`` అని అన్నారు.

అంటే మీకంటూ ఓ ఫోన్ లేదా? అని సుమ ప్ర‌శ్నించారు. ``ఉంది కానీ.. అదెక్క‌డుందో తెలీదు. నేను ఫోన్ విష‌యంలో చాలా బ్యాడ్. పెద్ద‌గా ప‌ట్టించుకోను`` అని మ‌హేష్ తెలిపారు. ఒక‌వేళ న‌మ్ర‌త‌తో పెళ్లి కాక‌పోయి ఉంటే ఫోన్ చాలా అవ‌స‌రం ప‌డేదేమో? అని సుమ అంటే.. అస్స‌లు వాడేవాడిని కా‌దేమో!! అని షాకిచ్చారు. మొత్తానికి స్మార్ట్ యుగంలో ఫోన్ వాడ‌ని ఒక స్టార్ హీరో ఉన్నార‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

అంతేకాదు పెళ్లి రోజు గురించి సుమ ప్ర‌శ్నిస్తే.. అది కూడా పెద్ద‌గా గుర్తుండ‌ద‌ని మ‌హేష్ అనేశాడు. ``కేవ‌లం భార్య‌ల‌కే గుర్తుంటుంది. అయితే భ‌ర్త‌లంతా మ్యారేజ్ డేని గుర్తు పెట్టుకున్న‌ప్పుడే ఇన్నేళ్ల‌య్యిందా? అని గుర్తొస్తుంది`` అంటూ సుమ సైలెంట్ గా సెటైర్ వేసేసింది. దానికి మ‌హేష్ చాలా సింపుల్ గా న‌వ్వేసారంతే. లాక్ డౌన్ వ‌ల్ల ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలోని సినిమా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ 27 ఈపాటికే ప్రారంభం కావాల్సి ఉన్నా మాయ‌దారి క‌రోనా అంత ప‌ని చేసింది.