Begin typing your search above and press return to search.
మరోసారి 'లూసీఫర్' చేతులు మారే అవకాశం ఉందా?
By: Tupaki Desk | 15 Nov 2020 11:30 AM ISTమెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్ పై ఆసక్తిగా ఉన్నాడు. సుజీత్ దర్శకత్వంలో ఆ రీమేక్ చేయాలని మొదట భావించారు. కాని ఆయన స్క్రిప్ట్ విషయంలో నిరాశ పర్చడంతో ప్రకటించకుండానే పక్కకు పెట్టేశారు అంటూ పుకార్లు షికార్లు వచ్చాయి. ఆయన తప్పుకున్న తర్వాత వినాయక్ దర్శకత్వంలో ఈ రీమేక్ ను ప్లాన్ చేశారు. దర్శకుడు వినాయక్ కూడా దాదాపు మూడు నాలుగు నెలల పాటు స్క్రిప్ట్ కోసం సిట్టింగ్స్ వేశారు. ప్రముఖ రచయితలు దర్శకులు కలిసినా కూడా స్ర్కిప్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దాంతో ఇప్పుడు మరో దర్శకుడు ఆ రీమేక్ కోసం పరిశీలించబడుతున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గబ్బర్ సింగ్ మరియు గద్దలకొండ గణేష్ సినిమాలు రెండు కూడా రీమేక్ లు అనే విషయం తెల్సిందే. కాని అవి రీమేక్ లు అనే విషయం తెలియకుండా పూర్తిగా మార్చేసి తనదైన శైలిలో పూర్తి వినోదాత్మకంగా తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కించాడు. అందుకే ఇప్పుడు లూసీఫర్ రీమేక్ బాధ్యతలను ఆయనకు అప్పగిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయంలో కొందరు ఉన్నారు. ఆ విషయమై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
పవన్ 28వ సినిమాను డైరెక్ట్ చేసేందుకు ప్రస్తుతం హరీష్ శంకర్ వెయిట్ చేస్తున్నాడు. కరోనా కారణంగా ఇప్పటికే ఆరంభం అవ్వాల్సిన పవన్ 28 సినిమా ఆలస్యం అవుతుంది. వచ్చ ఏడాది ద్వితీయార్థం వరకు పవన్ డేట్ల కోసం హరీష్ వెయిట్ చేయాల్సి రావచ్చు. ఆ గ్యాప్ లో చిరంజీవితో లూసీఫర్ రీమేక్ చేసే అవకాశం ఆయనకు ఇవ్వాలని మెగా కాంపౌండ్ భావిస్తున్నట్లుగా మీడియా సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే లూసీఫర్ మరోసారి చేతులు మారిందా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.