Begin typing your search above and press return to search.

బన్నీతో స్టెప్పులేయనున్న లోఫర్ బ్యూటీ...?

By:  Tupaki Desk   |   1 May 2020 11:45 AM IST
బన్నీతో స్టెప్పులేయనున్న లోఫర్ బ్యూటీ...?
X
పూరి జగన్నాధ్ తెరకెక్కించిన 'లోఫర్' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది దిశా పటానీ. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో అమ్మడికి ఇక్కడ అవకాశాలు రాలేదు. టాలీవుడ్ నుండి చెక్కేసి బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. అక్కడ స్టార్ హీరోల పక్కన్న ఛాన్సులు కొట్టేస్తూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు దిశా పటానీని మళ్లీ తెలుగు తెరకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ - సుకుమార్ ల హ్యాట్రిక్ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేశారు. 'పుష్ప' టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఐదు భాషలలో దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా బన్నీ రాయలసీమ చిత్తూరుకి చెందిన మొరటు కుర్రాడుగా కనిపించనున్నాడు. కాగా ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ఓ మంచి మసాలా ఐటెం సాంగ్ ఉంటుందని హింట్ ఇచ్చారు.

సుక్కు - దేవిశ్రీ కాంబినేషన్లో గతంలో వచ్చిన ఐటమ్ సాంగ్స్ దుమ్మురేపేశాయి. ఆర్య' సినిమాలో 'అ అంటే అమలాపురం...' 'ఆర్య 2' సినిమాలో 'రింగ రింగా..' డియాలో.. డియాలా' ( 100% లవ్).. 'లండన్ బాబూ.. లండన్ బాబూ' (నేనొక్కడినే).. 'జిల్ జిల్ జిగేలు రాణి' (రంగస్థలం) సాంగ్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే. వీటిలాగే ఈ సినిమాలోను మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ సాంగ్ ఉందట. ఈ సాంగ్ లో బన్నీకి జంటగా కాలుకదపనున్న ఐటమ్ భామ కోసం లెక్కల మాస్టర్ సుకుమార్ వెతుకుతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఆయన బాలీవుడ్ నుండి ఓ పాపులర్ హీరోయిన్ ని తేవాలని చూస్తున్నారని కూడా న్యూస్ వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్ కోసం దిశా పటానీని సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. గతంలో దిశా బన్నీ డాన్సులకు పెద్ద ఫ్యాన్ ని అని చెప్పిన తరుణంలో ఆమె దాదాపు ఒకే అయ్యే అవకాశం కలదని అంటున్నారు. కాగా ఈ సినిమా లో కథానాయికగా రష్మికను తీసుకున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ మరియు ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.