Begin typing your search above and press return to search.

విజయ్-పూరీల సినిమాకి టైటిల్ దొరికినట్లే..నా?

By:  Tupaki Desk   |   20 May 2020 9:50 AM GMT
విజయ్-పూరీల సినిమాకి టైటిల్ దొరికినట్లే..నా?
X
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండతో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ మాస్ హీరో కలిస్తే అభిమానులలో అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాకి టైటిల్‌ మారిందనే ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా ఈ కాంబినేషన్ సినిమాకి ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అయితే.. ఇటీవలే ఈ ఫైటర్ సినిమా టైటిల్‌ మార్చే ఆలోచనలో పూరీ ఉన్నాడని సహనిర్మాత ఛార్మి ప్రకటించింది. పూరీ కనెక్ట్స్ అండ్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్. ఇక ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ బాలీవుడ్ కి, అనన్య టాలీవుడ్ కి ఒకేసారి పరిచయం కానున్నారు.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు పూరీ స్టైల్ ఓ కొత్త టైటిల్ పెడతారని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు దేశంలోని అన్నీ భాషలకు సరిపోయేలా ఉంటుందని ‘లైగర్‌’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక ‘లైగర్‌’ అంటే ఏంటనేది ఎవరికీ పెద్దగా తెలియదు. దానర్ధం మగ సింహానికీ, ఆడ పులికీ క్రాస్‌ బ్రీడింగ్‌ జరగడం వల్ల పుట్టిన పిల్లను ‘లైగర్‌’ అంటారు. ఇలాంటి టైటిల్‌ తన సినిమాకు ఫిక్స్ చేయడానికి పూరీ పెద్ద ప్లానే వేసినట్లు తెలుస్తుంది. ముంబైలో షూటింగ్‌ మొదలైన ఈ సినిమా టైటిల్ కి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రిలీజ్‌ చేసేందుకు పూరీ అండ్‌ టీమ్ సన్నాహాలు చేస్తున్నారట. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషలలో రూపొందుతున్న ఈ సినిమాను పూరిజగన్నాథ్ మంచి కమర్షియల్ హంగులతో.. డిఫరెంట్ యాంగిల్లో ఐ-ఫీస్ట్ లా ఉండబోతుందని సినీ వర్గాలు టాక్.