Begin typing your search above and press return to search.

కృతి స‌న‌న్ సిస్ట‌ర్ ఎంట్రీ ఇంత బ్యాడ్‌ గానా?

By:  Tupaki Desk   |   10 Nov 2019 5:25 AM GMT
కృతి స‌న‌న్ సిస్ట‌ర్ ఎంట్రీ ఇంత బ్యాడ్‌ గానా?
X
కెరీర్ విష‌యం లో అతిగా జాగ్ర‌త్తగా వ్య‌వ‌హ‌రించ‌డం ఎప్ప‌టికీ మంచిది కాదు. అలా అతిగా ఆలోచించిన వాళ్లు త‌ప్ప‌ట‌గుడులు వేసిన సంద‌ర్భాలు చాలానే వున్నాయి. తాజాగా కృతి స‌న‌న్ సోద‌రిది కూడా ఇదే ప‌రిస్థితిని ఎదుర్కుంది. గ‌త కొంత కాలంగా హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వాల‌ని కృతి స‌న‌న్ సోద‌రి నుపూర్ స‌న‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మం లో త‌న‌ని వెతుక్కుంటూ వ‌చ్చిన క్రేజీ ప్రాజెక్ట్‌ ల‌ని ప‌క్క‌న పెట్టేసింది. అందులో తెలుగు చిత్రాలు కూడా వున్నాయి. అయితే కెరీర్ విష‌యం లో అతి జాగ్ర‌త్త‌కు పోయిన నుపూర్ చివ‌రికి పూర్ మ్యూజిక్ వీడియో తో ఎంట్రీ ఇచ్చి నిరాశ పరిచింది.

దేశీ మెలోడీస్ స‌మ‌ర్ప‌ణ‌ లో అర‌వీంద్ర‌ ఖైరా రూపొందించిన `ఫిల్‌హాల్‌` వీడియో సాంగ్‌ తో నుపూర్ ఎంట్రీ ఇచ్చింది. ట్రాజెడీ సాంగ్‌ గా చిత్రీక‌రించిన ఈ పాట‌లో నుపూర్‌ కు ఎలాంటి ప్రాధాన్యం లేదు. ఇందు లో ఆమెను ప్రేమించి పొంద‌లేక‌ పోయిన ప్రేమికుడి గా అక్ష‌య్‌ కుమార్ క‌నిపించారు. వీడియో ఎంట్రీ లోనూ నుపూర్ ఓ పేషెంట్‌ గా క‌నిపించ‌డంతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తుంద‌నుకున్న వాళ్లంతా ఈ వీడియో చూడ‌గానే నీర‌సించిపోయారు. అంత దారుణంగా హీరోయిన్ సిస్ట‌ర్ డెబ్యూ వీడియో వుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

హీరోయిన్ సిస్ట‌ర్ ఎంట్రీ అంటే గ్లామ‌ర‌స్‌ గా వుంటుంది. కానీ అందుకు భిన్నంగా ఓ పేషెంట్‌ లా ఎంట్రీ ఇవ్వ‌డం లో అంతా నుపూర్ ఎంట్రీ పై పెద‌వి విరుస్తున్నారు. అతి జాగ్ర‌త్త‌ కు పోతే ఇలాంటి ఫ‌లితమే ఎదుర‌వుతుంద‌ని, అతిగా ఆలోచించ‌డం వ‌ల్లే స‌రైన‌ దాన్ని ఎంచుకో లేక‌పోయార‌ని ఇప్పుడు కృతి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల‌ని బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.