Begin typing your search above and press return to search.

డాక్టర్లు ముందు రోజే చెప్పేశారా..?

By:  Tupaki Desk   |   15 Nov 2022 4:27 AM GMT
డాక్టర్లు ముందు రోజే చెప్పేశారా..?
X
సూపర్ స్టార్ కృష్ణ మృతి తెలుగు సినీ పరిశ్రమలో విషాద చాయలు అలముకునేలా చేసింది. ఆదివారం గుండెపోటు రావడంతో హాస్పిటల్ లో చేర్పించారు. అప్పటినుంచి ఆయన్ని కాపాడే ప్రయత్నం చేశారు డాక్టర్లు. పరిస్థితి అదుపులో తెచ్చేందుకు ఎంత ప్రయత్నించినా సరే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల ఆయన్ని కాపాడటం కష్టమని డాక్టర్లు ముందు రోజే వెళ్లడించారట.

ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారం రాత్రి 7 గంటలకు కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కి ట్రీట్ మెంట్ ఫలించదని డాక్టర్లు చెప్పేశారట. వెంటిలేటర్ మీద ఉండగా మంగళవారం ఉదయం 4:09 గంటలకు తుది శ్వాస విడిచారు కృష్ణ.

తెలుగు తెర మీద సూపర్ స్టార్ గా ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. సాహసమే ఊపిరిగా.. తెలుగు సినిమాకు కొత్త టెక్నాలజీ తెస్తూ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. హీరోగానే కాదు డైరక్టర్ గా.. నిర్మాతగా కూడా సూపర్ స్టార్ కృష్ణ తన ప్రతిభ కనబరిచారు.

ఎందుకు రిస్క్ అని ఎవరైనా అంటే చాలు.. కావాలని రిస్క్ చేసి మరి సినిమాలు చేసే వారు కృష్ణ. తెలుగు సినిమా పుస్తకంలో కృష్ణ గారి పేరు కూడా సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది.

సూపర్ స్టార్ కృష్ణ మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. తెలుగు తెర మీద ఆయన చేసిన పాత్రలు.. ఆయన చేసిన ప్రయోగాలను గుర్తు చేసుకుంటూ అభిమానులు ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నారు.

ఆ తరం ఓ అరుదైన జ్ఞాపకంగా ఇన్నాళ్లు మనతోనే ఉన్న నట శేఖరుడు ఇవాళ అందరిని విడిచి అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన సినిమాలు.. ఆయన పోషించిన పాత్రలు ఎప్పుడూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.