Begin typing your search above and press return to search.

కియారా ప్రేమాయణం పై హింట్ ఇస్తోందా..?

By:  Tupaki Desk   |   27 Nov 2020 8:00 AM IST
కియారా ప్రేమాయణం పై హింట్ ఇస్తోందా..?
X
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ 'ఫగ్లీ' సినిమాతో తెరంగేట్రం చేసింది. 'ఎం.ఎస్.ధోని' సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక సూపర్ స్టార్ మ‌హేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఒక్క సినిమాతో తెలుగులో స్టార్ హీరోయిన్‌ హోదా సంపాదించుకుంది. అయితే వెంటనే 'వినయ విధేయ రామ' సినిమాలో నటించిన ఈ బ్యూటీ మరో తెలుగు సినిమాలో నటించలేదు. బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. ఇక యువ హీరోతో డేటింగ్ చేస్తుందనే రూమర్స్ తో వార్తల్లో నిలుస్తోంది.

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో.. కియారా రిలేషన్ లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరు లేట్‌ నైట్‌ పార్టీస్‌ చేసుకుంటున్నారని.. డిన్నర్‌ మీటింగ్స్‌ పెడుతున్నారని బీ టౌన్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే ఈ ప్రచారంపై కియారా గానీ.. సిద్ధార్థ్‌ గానీ ఇప్పటివరకు రియాక్ట్‌ కాలేదు. తాజాగా ట్విట్టర్ వేదికగా కియారా - సిద్దార్థ్ మధ్య ఏదో నడుస్తోందనే ప్రచారం నిజమే అని పరోక్షంగా క్లారిటీ ఇస్తున్నట్లు నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటించిన 'ఇందూకీ జవానీ' ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కియారా ట్విట్టర్‌ లో పోస్ట్ చేసిన ట్రైలర్‌ లింక్‌ పై సిద్దార్థ్ స్పందిస్తూ 'ఇందూ ఫుల్‌ ఫైర్‌ లో ఉంది.. చూడ్డానికి వెయిట్‌ చేస్తున్నామ'ని ట్వీట్ చేశాడు. దీనికి కియారా 'ఇందూ కూడా నిన్ను చూడ్డానికి ఎదురుచూస్తోంద'ని రిప్లై ఇచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని ఇండైరెక్టుగా హింట్ ఇస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయినా బాలీవుడ్ లో ఒకరితో ప్రేమాయణం సాగించడం.. బ్రేకప్ చెప్పి మరొకరితో జోడీ కట్టడం సర్వసాధారణంగా జరిగేదేగా!