Begin typing your search above and press return to search.

'ఖిలాడి' డైరెక్టర్ పెద్ద సాహసమే చేయబోతున్నాడా!

By:  Tupaki Desk   |   23 Aug 2022 7:30 AM GMT
ఖిలాడి డైరెక్టర్ పెద్ద సాహసమే చేయబోతున్నాడా!
X
టాలీవుడ్ ప్రేక్షకులకు మరియు ఇండస్ట్రీ వర్గాల వారికి దర్శకుడు రమేష్ వర్మ సుపరిచితుడు. ఈయన చేసిన సినిమాల్లో మెజార్టీ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడు మాదిరిగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు 'రాక్షసుడు' అనే సినిమా తో సక్సెస్ ను దక్కించుకున్నాడు. ఆ సినిమా హిట్ అవ్వడంతో వెంటనే రవితేజ తో ఖిలాడి సినిమాను చేసిన విషయం తెల్సిందే.

రవితేజ అభిమానులతో పాటు అంతా కూడా ఖిలాడి సినిమా పై చాలా నమ్మకం పెట్టుకున్నారు. కానీ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడింది. అయినా కూడా రమేష్ వర్మ తన సినిమా ల జోరు మాత్రం తగ్గించడం లేదు. తాను తెరకెక్కించిన రాక్షసుడు సినిమాకు సీక్వెల్‌ ను చేసేందుకు సిద్ధం అయ్యాడు. సీక్వెల్‌ లో కన్నడ సూపర్ స్టార్‌ సుదీప్ ను నటింపజేస్తున్నాడట.

తమిళంతో వచ్చిన రాక్షసన్‌ సినిమాకు రీమేక్ గా బెల్లకొండ సాయి శ్రీనివాస్ తో రమేష్ వర్మ రాక్షసుడు సినిమాను తెరకెక్కించి సక్సెస్ దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆ రీమేక్ కు సీక్వెల్‌ ను చేసేందుకు సిద్ధం అయ్యాడు.

రమేష్ వర్మ చెప్పిన రాక్షసుడు 2 కథ కి సుదీప్ బాగా కనెక్ట్‌ అయ్యాడట. పాన్ ఇండియా సబ్జెక్ట్‌ అవ్వడంతో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇటీవలే విక్రాంత్ రోనా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుదీప్ త్వరలోనే రమేష్ వర్మ దర్శకత్వంలో రాక్షసుడు 2 సినిమా ను చేసేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. రాక్షసుడు సినిమా రీమేక్ కనుక హ్యాండిల్ చేయడం ఈజీ అయ్యింది. కానీ సొంత కథను రమేష్ వర్మ ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.

ఖిలాడి సినిమా తర్వాత రమేష్ వర్మ పై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా పెద్దగా నమ్మకం లేదు అనేది టాక్. ఈ సమయంలో ఈయన రాక్షసుడు 2 సినిమా ను ఎలా డీల్ చేస్తాడు.. సుదీప్‌ ఏం నచ్చి ఈ సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు అంటూ చర్చ జరుగుతోంది. మొత్తానికి రాక్షసుడు 2 అనేది రమేష్‌ వర్మ మరియు సుదీప్ చేయబోతున్న పెద్ద సాహసం అంటూ టాక్ వినిపిస్తుంది.