Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ ఆదిపురుష్ 3Dలో DDLJ కాజోల్

By:  Tupaki Desk   |   21 March 2021 5:30 PM GMT
ప్ర‌భాస్ ఆదిపురుష్ 3Dలో DDLJ  కాజోల్
X
మెరుపుక‌ల‌లు చిత్రంలో అర‌వింద స్వామి - ప్ర‌భుదేవా లాంటి ట్యాలెంటెడ్ స్టార్ల స‌ర‌స‌న న‌టించింది కాజోల్. అంతకుముందే బాలీవుడ్ లో షారూక్ డీడీఎల్ జే (దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే)తో ప్రేమ‌క‌థా చిత్రాల నాయిక‌గా ఓ వెలుగు వెలిగిన కాజోల్ స్టార్ హీరోయిన్ గా గొప్ప‌ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అందానికి అందం ప్ర‌తిభ‌తో కాజోల్ అప్ప‌ట్లో కొన్నేళ్ల పాటు చ‌క్రం తిప్పాక యాక్ష‌న్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ ని పెళ్లాడి ఫ్యామిలీ లైఫ్ లో సెటిలైన సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌ల కంబ్యాక్ కోసం త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ సినిమాలో న‌టించినా అది ఏమంత వ‌ర్క‌వుట్ కాలేదు. ఆ త‌ర్వాతా సౌత్ లో ఘ‌న‌మైన ఎంట్రీ కోసం కాజోల్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఎట్ట‌కేల‌కు తాను ఆశించిన అలాంటి ఒక పెద్ద ఆఫ‌ర్ వ‌రించింద‌ని తెలిసింది.

డార్లింగ్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా ఓంరౌత్ తెర‌కెక్కిస్తున్న ఆదిపురుష్ 3డిలో కాజోల్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఈ మూవీలో ఇప్ప‌టికే కృతి స‌నోన్ సీత పాత్ర‌లో న‌టిస్తోంది. సైఫ్ అలీఖాన్ రావ‌ణుడిగా క‌నిపించ‌నున్నారు. ప్ర‌భాస్ లార్డ్ శ్రీ‌రాముడిగా న‌టిస్తున్నారు. ఇలాంటి కీల‌క చిత్రంలో కాజోల్ న‌టిస్తున్నార‌న్న దానికి ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంటుంది.

దాదాపు 500కోట్ల బడ్జెట్ తో ఇండియాలోనే నెవ్వ‌ర్ బిఫోర్ అన్నంత రేంజులో ఈ చిత్రాన్ని టీసిరీస్ సంస్థ నిర్మిస్తోంద‌ని స‌మాచారం. క్రిష‌న్ కుమార్.. ఓంరౌత్ కూడా ఈ సినిమా నిర్మాత‌లుగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.