Begin typing your search above and press return to search.

ఈ టైమ్‌ లో డీ గ్లామర్‌ ప్రయోగం అవసరమా అమ్మడు?

By:  Tupaki Desk   |   31 May 2021 7:52 AM GMT
ఈ టైమ్‌ లో డీ గ్లామర్‌ ప్రయోగం అవసరమా అమ్మడు?
X
టాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్స్ మిల్కీ బ్యూటీ తమన్నా.. సమంతలు లేడీ ఓరియంటెడ్‌ మూవీస్ తో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే చందమామ స్టార్‌ కాజల్‌ అగర్వాల్‌ కూడా లేడీ ఓరియంటెడ్‌ మూవీకి సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. పెళ్లి చేసుకున్న తర్వాత కాజల్‌ అగర్వాల్‌ సినిమాల ఎంపిక విషయంలో కాస్త పద్దతి మార్చుకున్నట్లుగా ఆమద్య మార్పులు వచ్చాయి. అనుకున్నట్లుగానే కాజల్‌ ఒక లేడీ ఓరియంటెడ్‌ సినిమాకు ఓకే చెప్పిందని త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కబోతుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

జయశంకర్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న లేడీ ఓరియంటెడ్‌ సినిమాతో కాజల్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో డీ గ్లామర్ గా కాజల్ కనిపించబోతుందట. ఇప్పటి వరకు కాజల్‌ కనిపించనంత డీ గ్లామర్ గా దర్శకుడు జయశంకర్‌ చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కాజల్ ప్రస్తుతం ఆచార్య సినిమాతో పాటు మరి కొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది. ఈ సమయంలోనే ఈమె డీ గ్లామర్‌ రోల్స్‌ వంటి ప్రయోగం చేయడం ఎంత వరకు సబబు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

టాలీవుడ్ ప్రేక్షకులు హీరోయిన్స్ ను డీ గ్లామర్‌ గా అస్సలు కోరుకోరు. అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కాజల్‌ నిర్ణయం పట్ల కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. ఈ సమయంలో డీ గ్లామర్‌ గా నటిస్తే ముందు ముందు ఆఫర్లు అఆంటివే వస్తాయని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా కు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగున్నట్లుగా తెలుస్తోంది. పెళ్లి తర్వాత కూడా కాజల్‌ వరుసగా సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నా వస్తున్న ఆఫర్లు అరకొరగానే ఉన్నాయి అనేది ఇండస్ట్రీలోని ఒక వర్గం వారి వాదన.