Begin typing your search above and press return to search.

భార‌తీయుడు 2 .. కాజ‌ల్ స్కిప్ నిజ‌మా?

By:  Tupaki Desk   |   5 Jun 2019 8:56 AM GMT
భార‌తీయుడు 2 .. కాజ‌ల్ స్కిప్ నిజ‌మా?
X
క‌మ‌ల్ హాస‌న్ - శంక‌ర్ కాంబినేష‌న్ క్రేజీ మూవీ `భార‌తీయుడు 2` ఇంత‌కీ ఉన్న‌ట్టా లేన‌ట్టా? ఈ సినిమాకి తొలి నుంచి ఏవో అడ్డంకులొస్తూనే ఉన్నాయి. ఒక‌సారి బ‌డ్జెట్ ప‌ర‌మైన స‌మ‌స్య అని.. మ‌రోసారి మేక‌ప్ స‌రిప‌డ‌డం లేద‌ని.. క‌మ‌ల్ రాజ‌కీయారంగేట్రం ఇబ్బంది పెడుతోంద‌ని.. ఇంకోసారి లైకా సంస్థ‌ వ‌ద్ద‌నుకుంటే వేరొక పెద్ద ప్రొడ‌క్ష‌న్ హౌస్ తో టై అప్ పెట్టుకున్నార‌ని.. ర‌క‌ర‌కాలుగా రూమ‌ర్లు వ‌చ్చాయి. శంక‌ర్ గ‌త చిత్రం 2.0 బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిల‌వ్వ‌డంతో ఈ సినిమాని నిర్మించేందుకు లైకా సంస్థ పున‌రాలోచ‌న‌లో ప‌డింద‌ని అప్ప‌ట్లో ప్ర‌చార‌మైంది.

అయితే ఎన్ని ర‌కాలుగా ప్ర‌చార‌మైనా భార‌తీయుడు 2ని ఆపేది లేద‌ని శంక‌ర్ తేల్చేశాడు. లైకా సంస్థ తీయ‌క‌పోయినా బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌ల‌తో క‌లిసి సినిమాని పూర్తి చేసే ఆలోచ‌న‌లో శంక‌ర్ ఉన్నార‌ని ప్ర‌చార‌మైంది. అయితే ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ప‌దే ప‌దే ఇలా వాయిదా ప‌డుతుంటే అది త‌న కెరియ‌ర్ కి ఇబ్బంది క‌లిగిస్తోంద‌ని చిత్ర క‌థానాయిక కాజ‌ల్ భావించింద‌ట‌ అందుకే ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంద‌ని తాజాగా మ‌రో కొత్త ప్ర‌చారం సాగుతోంది.

ఇది నిజ‌మా? అంటే ఈ ప్ర‌చారంలో ఎలాంటి నిజం లేద‌ని తాజాగా రివీలైంది. భార‌తీయుడు 2 నుంచి కాజ‌ల్ త‌ప్పుకోలేదు. ఇందులో న‌టిస్తున్నారు. అయితే ఈ సినిమాతో పాటు జ‌యం ర‌వి స‌ర‌స‌న `కోమ‌లి` అనే వేరొక భారీ ప్రాజెక్టులోనూ కాజ‌ల్ న‌టించ‌నుంది. ఇట‌వ‌లే తెలుగు మీడియాతో ముచ్చ‌టించిన కాజ‌ల్ ఓ భారీ ప్రాజెక్టు గురించి తొంద‌ర్లోనే చెబుతాన‌ని తెలిపింది. అది ఈ సినిమాయేన‌ని భావించాల్సి ఉంటుంది. ఇక భార‌తీయుడు 2 సెట్స్ కి వెళ్లేందుకు ఇప్ప‌టికే విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ప్రిప‌రేష‌న్ లో ఉన్నార‌ట‌. ప్రోస్థ‌టిక్స్ కి కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటే ..ఇప్ప‌టికే క‌మ‌ల్ - కాజ‌ల్ పై టెస్టులు పూర్త‌య్యాయి. అమెరికాలో అందుకు సంబంధించిన టెస్టులు పూర్తి చేశారు. తొంద‌ర్లోనే ఆ ఇద్ద‌రిపైనా కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌నున్నార‌ట‌.