Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ హౌస్‌ లో జలజ ఈమెనా?

By:  Tupaki Desk   |   27 Nov 2020 4:02 PM IST
బిగ్‌ బాస్‌ హౌస్‌ లో జలజ ఈమెనా?
X
తెలుగు బిగ్‌ బాస్ ఈ వారం దెయ్యంతో ఆట టాస్క్‌ ను కంటెస్టెంట్స్‌ తెగ ఎంజాయ్‌ చేశారు. ఈ టాస్క్‌ లో భాగంగా ఇంటి సభ్యులకు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన 12వ అంతస్తు సినిమాను కూడా వేశారు. ఆ సినిమా మొత్తం చూసిన ఇంటి సభ్యులు దెయ్యం జలజ ఇచ్చిన టాస్క్‌ లను చేశారు. టాస్క్‌ మొదటి రోజు అరియానాకు అద్దంలో జలజ కనిపించి అరిపించిన విషయం తెల్సిందే. దెయ్యంగా కనిపించింది ఎవరు.. జలజ అంటూ మాట్లాడుతున్నది ఎవరు అంటూ ఎవరికి తోచినట్లుగా వారు ఊహించుకున్నారు. అవినాష్‌ అయితే ఆర్‌జే సునీత అంటూ చాలా బలంగా అంటున్నాడు. మరి కొందరు మరి కొన్ని పేర్లు చెబుతున్నారు.

సోషల్‌ మీడియాలో మాత్రం ఆ వాయిస్‌ మాత్రం కరాటే కళ్యాణిది అంటున్నారు. ఈ సమయంలోనే అద్దంలో కనిపించింది మాత్రం బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అయిన భానుశ్రీ అంటున్నారు. ఆమెను కాస్త తీక్షణంగా చూస్తే భాను లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక భాను అయ్యి ఉంటుందని నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భాను వాయిస్‌ కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. ఆమె కాస్త గొంతు మార్చి జలజ మాదిరిగా మాట్లాడుతుందేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ ను రచ్చ రచ్చ గా భయపెట్టిన జలజ ఎవరు అనే విషయాన్ని నాగార్జున రేపు వీకెండ్‌ ఎపిసోడ్‌ లో ఏమైనా రివీల్‌ చేస్తాడేమో చూడాలి.