Begin typing your search above and press return to search.

టాలీవుడ్ బ్యాచిల‌ర్స్ పెళ్లికి వేళైందా?

By:  Tupaki Desk   |   19 Aug 2022 2:30 AM GMT
టాలీవుడ్ బ్యాచిల‌ర్స్ పెళ్లికి వేళైందా?
X
టాలీవుడ్ లో పెళ్లికి రెడీగా వున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ లిస్ట్ క‌రోనాకు ముందు చాన్తాడంత వుండేది. కానీ క‌రోనా త‌రువాత అది కాస్త కొంత క‌రిగిపోయింది. కార‌ణంగా కోవిడ్ సెకండ్, థ‌ర్డ్ వేవ్ లో కొంత మంది హీరోలు పెళ్లిపీట‌లెక్క‌డ‌మే. అయినా స‌రే పెళ్లికి రెడీగా వున్న బ్యాచిర్ హీరోల లిస్ట్ ప్ర‌స్తుతం భారీగానే వుంది. ప్ర‌భాస్ నుంచి మొద‌లు కుంటే యంగ్ హీరో రాజ్ త‌రుణ్ వ‌ర‌కు చాలా మంది హీరోలు పెళ్లికి రెడీగా వున్నారు.

ఇందులో కొంత మంది పెళ్లికి రెడీ అంటూ సిగ్న‌ల్స్ ఇస్తుంటే కొంత మంది మాత్రం ఇప్ప‌టికీ పెళ్లి గురించి పెద్ద‌గా ప్ర‌స్థావ‌న తీసుకురావ‌డం లేదు. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ పేరు ప్ర‌ధానంగా వినిపిస్తూ వ‌స్తోంది. గ‌త మూడు నాలుగేళ్లుగా ప్ర‌భాస్ పెళ్లి ప్ర‌స్థావ‌న పై వార్త‌లు వినిపిస్తున్నా పెల్లిపై ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భాస్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. రావ‌డం లేదు. 'బాహుబ‌లి' సిరీస్ సినిమాల త‌రువాత పెళ్లి చేసుకుంటాన‌ని మాటిచ్చాన‌ని ప్ర‌భాస్ అన్నాడు.

కానీ ఇంత వ‌ర‌కు పెళ్లి ఊసు ఎత్త‌డం లేదు. ఇక ప్ర‌భాస్ త‌రువాత లైన్ లో వుండాల్సిన రానా క‌రోనా సెకండ్ వేవ్ లోనే పెళ్లిపీట‌లెక్కేశాడు. దీంతో సీనియ‌ర్ గా ప్ర‌భాస్ మాత్ర‌మే టాలీవుడ్ లో పెళ్లికి రెడీగా వున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ గా మిగిలిపోయాడు. ఇక ఆ త‌రువాత ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు శ‌ర్వానంద్‌, రామ్‌.. ఇటీవ‌ల రామ్ త‌న చిన్న‌నాటి స్నేహితురాలిని పెళ్లాడ‌బోతున్నాడంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపించాయి.

అయితే ఇవ‌న్నీ గాలి వార్త‌ల‌ని, ఇప్ప‌ట్లో తాను పెళ్లి చేసుకోవాల‌నుకోవ‌డం లేద‌ని రామ్ క్లారిటీ ఇచ్చాడు. అంతే కాకుండా ఈ విష‌యంలో ఇంట్లో వాళ్ల‌కు కూడా అనుమానాలు త‌లెత్త‌డంతో ఫైన‌ల్ గా క్లారిటీ ఇవ్వాల్సి వ‌స్తోంద‌ని చెప్పుకొచ్చాడు. ఈ ఇద్ద‌రి త‌రువాత లైన్ లో వున్న మెగా హీరోలు సాయి ధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్ తేజ్‌. ఈ ఇద్ద‌రు హీరోల‌కు సంబంధించిన పెళ్లి ప్ర‌య‌త్నాల‌ని వీరి ఫ్యామిలీ చేస్తూనే వుంది. ఇటీవ‌ల నాగ‌బాబు .. వ‌రుణ్ తేజ్ పెళ్లి గురించి వెల్ల‌డించడం తెలిసిందే.

వీరి త‌రువాత అడివి శేష్‌, నాగ‌శౌర్య‌, సందీప్ కిష‌న్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అల్లు శిరీష్‌, బెల్లంకొండ శ్రీ‌నివాస్‌, న‌వ‌దీప్‌, నారా రోహిత్‌, సుశాంత్‌, రాజ్ త‌రుణ్ వంటి హీరోలు పెళ్లికి రెడీగా వున్నారు. అనూహ్యంగా ఈ మ‌ధ్య కాలంలో నితిన్‌, నిఖిల్ వంటి యంగ్ హీరోలు వివాహం చేసుకోవ‌డంతో ప్ర‌స్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ పెళ్లికి వేళైందంటూ కామెంట్ లు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే ఈ గ్రూప్ లో వున్న ఓ యంగ్ హీరో త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా పెళ్లి వార్త‌లు షికారు చేసిన స‌ద‌రు యంగ్ హీరో నిజంగానే త‌ను ప్రేమించిన యువ‌తిని వివాహం చేసుకోబోతున్న‌ట్టుగా తెలుస్తోంది.