Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: ఈ భామలు ఇక గ‌ల్లంతే

By:  Tupaki Desk   |   27 Feb 2020 3:30 AM GMT
టాప్ స్టోరి: ఈ భామలు ఇక గ‌ల్లంతే
X
కొత్త నీరు వ‌చ్చి పాత నీరు పోవాలి. అప్పుడే చెరువు అయినా.. న‌ది అయినా న‌వ‌న‌వ‌లాడుతుంది. రంగుల ప‌రిశ్ర‌మ‌కు ఇది వ‌ర్తిస్తుంది. ప్ర‌తిసారీ పాత ముఖాల్నే చూడాలంటే బోర్ ఫీల‌వుతారు ఆడియెన్. కొత్త‌ద‌నం కోరుకుంటుంది యూత్. ముంబై- బెంగ‌ళూరు-దిల్లీ-క‌ల‌క‌త్తా- పూణే- హైద‌రాబాద్ స‌హా దేశ‌వ్యాప్తంగా ఉన్న టాప్ మోడ‌ల్స్ ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశం అందుకోవ‌డానికి కార‌ణ‌మిదే.

ఇక ప్ర‌స్తుతం ఉన్న సీనియ‌ర్ బ్యూటీస్ లో టాలీవుడ్ లో ఆ తొమ్మిది మంది భామ‌ల‌ కెరీర్ చ‌ర‌మాంకంలో ఉందా? అంటే అవున‌నే భావించాల్సి ఉంటుంది. ఢిల్లీ బ్యూటీ ర‌కుల్ ప్ర‌త్ సింగ్ `వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్` చిత్రంతో ఇక్క‌డ పాపుల‌రైంది. ఆ త‌ర్వాత టాలీవుడ్ లో బిజీ నాయిక‌గా వెలిగింది. ఎన్టీఆర్..మ‌హేష్...రామ్ చ‌ర‌ణ్‌...బ‌న్నీ ఇలా దాదాపు స్టార్ హీరోలంద‌రితోనూ న‌టించేసింది. జోరు ఉన్నంత కాలం ప‌రిశ్ర‌మ‌ను ఏలింది. బ్రాండ్ అంబాసిడ‌ర్ గా.. జిమ్ నిర్వాహ‌కురాలిగానూ నాలుగు చేతులా ఆర్జించేస్తోంది. అయితే ఇటీవ‌ల కెరీర్ మాత్రం జీరో అయిపోయింది. ప్ర‌స్తుతం ర‌కుల్ కి తెలుగులో ఒక్క ఛాన్స్ కూడా లేదు. కోలీవుడ్ లో మాత్రం `ఇండియ‌న్ -2`లో న‌టిస్తోంది. అక్క‌డ‌ కెరీర్ ఎలా ఉంటుందో కాల‌మే నిర్ణ‌యించాలి.

చంద‌మామ‌ కాజ‌ల్ అగ‌ర్వాల్ టాలీవుడ్ కెరీర్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంద‌ని క‌థ‌నాలు వెడెక్కించిన‌ప్పుడ‌ల్లా మ‌రో బిగ్ ఛాన్స్ తో వార్త‌ల్లో నిలుస్తుంది. ప్ర‌స్తుతం `ఇండియ‌న్ -2`లో క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న న‌టిస్తోంది. టాలీవుడ్ ఛాన్సులైతే చేతిలో ఏవీ లేవు. మునుముందు కెరీర్ పై హోప్ అయితే క‌నిపించ‌లేదు.

మ‌రోవైపు టాలీవుడ్ లో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ గా వెలిగిపోయిన అనుష్క ఒక్క‌సారిగా సైలైంట్ అయిపోయింది. వ‌చ్చిన అవ‌కాశాల‌ను కాదనుకుంటోందా.. లేక‌ అవ‌కాశాలు లేవా? అన్న‌ది ఓ మిస్ట‌రీలా ఉంది. ప్ర‌స్తుతం `నిశ‌బ్ధం`లో న‌టిస్తోంది. అనుష్క ఇక పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ కావాల‌ని అనుకుంటోంద‌న్న ప్ర‌చారం అంతే జోరుగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అందాల కేథ‌రీన్ అడ‌ద‌డ‌పా వ‌చ్చిన అవ‌కాశాల‌తో కెరీర్ బండి నెట్టుకొచ్చేస్తోంది.

ఇక రాశీఖ‌న్నా ఇన్నాళ్లు సరైన స‌క్సెస్ లేకుండానే గ్లామ‌ర్ చొర‌వ‌తో అవ‌కాశాలు ఒడిసిప‌ట్టుకుంది. ఇటీవ‌ల‌ వెంకీమామ‌..ప్ర‌తిరోజు పండ‌గే చిత్రాల‌తో స‌క్సెస్ అందుకున్నా అవ‌న్నీ యావ‌రేజ్ రిజ‌ల్ట్ తో స‌రిపుచ్చుకున్నాయి. రాశీకి వీటివ‌ల్ల విప‌రీతంగా క‌లిసొచ్చేసిందేమీ లేదు. ఇటీవ‌లే `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చినా ప‌రాజ‌యం పెద్ద మైన‌స్ అయ్యింది. ఇదేదీ కెరీర్ కి క‌ల‌సి రాలేదు. ప్ర‌స్తుతం తెలుగులో అవ‌కాశాలేవీ లేవు. త‌మిళ్ లో మాత్రం ఓ రెండు సినిమాలు చేస్తోంది.

మ‌రో వైపు లావ‌ణ్య త్రిపాఠిని ఇన్నాళ్లు ల‌క్ మాత్ర‌మే న‌డిపించింది. కానీ ఇలా ఇంకెన్నాళ్లు? మొన్న‌టికి మ‌న్న‌ అర్జున్ సూర‌వ‌రం లో క‌నిపించినా అది త‌న‌కు ప్ల‌స్ ఏమీ కాలేదు. సినిమాకు మంచి టాక్ వ‌చ్చినా క్రెడిట్ అంతా నిఖిల్ ఖాతాలోకే వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం సందీప్ కిష‌న్ స‌ర‌స‌న `ఏ1 ఎక్స్ ప్రెస్`లో.. కార్తీకేయ స‌ర‌స‌న `చావు క‌బురు చ‌ల్ల‌గా` చిత్రాల్లో లావ‌ణ్య‌ న‌టిస్తోంది. టాలీవుడ్ లో పెద్ద రేంజ్ అయితే రాలేదు. ఈ సీన్ చూస్తుంటే.. భారీ పోటీలో ఇది చ‌ర‌మాంక‌మేన‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. వెల్లువ‌లా దూసుకొచ్చి వెంట‌నే చ‌ప్పున చ‌ల్లారిపోయిన భామ‌లు కొంద‌రు ఉన్నారు. ప్ర‌గ్యా జైశ్వాల్..రెజీనా..హెబ్బా ప‌టేల్ కెరీర్ న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంది. మొత్తంగా ఈ భామ‌లంద‌రి కెరీర్ కంచికి చేరిన‌ట్లేన‌న్న టాక్ వినిపిస్తోంది.