Begin typing your search above and press return to search.

అలా చేసే కంటే థియేట‌ర్లు మూసుకోవ‌డమే బెస్ట్!

By:  Tupaki Desk   |   3 Jun 2020 11:00 PM IST
అలా చేసే కంటే థియేట‌ర్లు మూసుకోవ‌డమే బెస్ట్!
X
మ‌హ‌మ్మారీ నేప‌థ్యంలో.. ఇప్ప‌ట్లో షూటింగుల‌కు లైన్ క్లియ‌ర్ అయ్యే అవ‌కాశం లేద‌ని నిర్మాత‌లంతా బెదిరిపోయారు. ముఖ్యంగా పెండింగ్ షూటింగులు ఉన్న వాళ్లంతా ఏం చేయాలో పాలుపోని స‌న్నివేశం నెల‌కొంది. ఈ వ్య‌వ‌హారం ఇలా ఉంటే అటు థియేట‌ర్లు కూడా ఇప్ప‌ట్లో తెరుచుకునే వీల్లేద‌న్న సంకేతాలు వెలువ‌డ్డాయి. దీంతో మ‌రింత‌గా ప‌రేషాన్ అయిపోయారు. ఇప్ప‌టికే షూటింగుల‌కు అనుమ‌తులిచ్చేసిన తెలుగు రాష్ట్రాలు త్వ‌ర‌లో థియేట‌ర్ల‌ను తెర‌వ‌నున్నాయ‌ట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఆగ‌స్టు నుంచి థియేట‌ర్లు - మాల్స్ తెరిచేందుకు ప‌ర్మిష‌న్లు ఇచ్చేస్తార‌ని జ‌నం మాట్లాడుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో షూటింగుల‌కు విధించిన‌ట్టే థియేట‌ర్లకు మాల్స్ కి కండీష‌న్స్ అప్ల‌య్! అనేస్తే అది గిట్టుబాటు అవుతుందా? అన్న విశ్లేష‌ణా సాగుతోంది. దీనికి ప‌లువురు ఎగ్జిబిట‌ర్లు స‌సేమిరా అనేస్తున్నారు. ముఖ్యంగా థియేటర్ లైన్ లో సామాజిక దూరం .. శానిటేష‌న్ స‌హా థ‌ర్మ‌ల్ చెకింగ్ వ‌రకూ ఓకే కానీ.. మ‌ధ్య‌లో ఒక సీటు తీసేసి స‌గం న‌ష్టానికి సినిమా చూపించాలంటే మాత్రం త‌మ‌కు కుద‌ర‌ద‌ని ఎగ్జిబిట‌ర్స్ చెబుతున్నార‌ట‌.

ఇలా చేస్తే మినిమం క‌రెంటు బిల్లులు.. సైకిల్ స్టాండ్ బిల్లులు కూడా రావ‌న్న‌ది వారి వుద్ధేశం. దీనివ‌ల్ల లీజులైనా గిట్టుబాటు అయ్యే సీన్ ఉండ‌దు. అందుకే సీట్ల కుదింపు అన్న‌ది సాధ్యం కానిది! అని చెప్పేస్తున్నారు. దానికంటే థియేట‌ర్లు మూసుకుని ఉండ‌డ‌మే మేల‌న్న అభిప్రాయం అట్నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. నిన్న హైద‌రాబాద్ సుద‌ర్శ‌న్ థియేట‌ర్ లో సీట్ల మ‌ధ్య గ్యాప్ మెయింటెన్ చేస్తున్న ఫోటోని సోష‌ల్ మీడియాలో రివీల్ చేయ‌డంతో దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. కానీ ఇలా జ‌ర‌గ‌డం సాధ్యం కాద‌ని థియేట‌ర్ల య‌జ‌మానులు భావిస్తున్నారు.