Begin typing your search above and press return to search.

యంగ్ హీరో ట్రాక్ తప్పుతున్నాడా ?

By:  Tupaki Desk   |   10 Aug 2019 7:13 AM GMT
యంగ్ హీరో ట్రాక్ తప్పుతున్నాడా ?
X
2017లో 'ప్రేమతో మీ కార్తీక్' అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు కార్తికేయ. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అవ్వలేదు. రెండో ప్రయత్నంగా అజయ్ భూపతి డైరెక్షన్ లో 'ఆర్ ఎక్స్ 100' సినిమా చేసాడు. అది ఎవరూ ఊహించని విధంగా సూపర్ హిట్ ని దాటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమా కార్తికేయకు హీరోగా మంచి గుర్తింపుతో పాటు భారీ వసూళ్లు కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఈ హీరో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడని ఊహించిన వారందరికీ 'హిప్పీ' అనే సినిమాతో షాక్ ఇచ్చాడు.

'ఆర్ ఎక్స్ 100' తో మంచి క్రేజ్ సంపాదించుకున్న కార్తికేయ 'హిప్పీ' తో ఆ ఇమేజ్ డామేజ్ చేసుకున్నాడు. నిజానికి అంతటి స్టార్డం వచ్చినప్పుడు హిప్పి లాంటి స్క్రిప్ట్ ఎంచుకోవడం తమిళ దర్శకుణ్ణి గుడ్డిగా నమ్మి నష్టపోయారు. 'హిప్పీ' స్థానంలో ఏదైనా మంచి స్టఫ్ ఉన్న కథను ఎంచుకుని సినిమా చేస్తే నెక్స్ట్ లెవెల్ హీరోల లిస్ట్ లో చేరిపోయేవాడు. ఆ తర్వాత 'గుణ 369' అంటూ ఓ స్ట్రాంగ్ మెసేజ్ తో వచ్చినప్పటీకీ ఆశించిన విజయం సాధించలేకపోయాడు. ఈ సినిమా విషయంలో మాత్రం కార్తికేయను తప్పుబట్టలేం. సినిమాలో హిట్టయ్యే కంటెంట్ ఉంది. కానీ కొన్ని మేజర్ మైనస్ లు, ఫస్ట్ హాఫ్ వల్ల సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

ఈ యంగ్ హీరో చేసిన మూడు సినిమాల్లో ఒకటి బ్లాక్ బస్టర్ కాగా మిగిలిన రెండూ బోల్తా కొట్టాయి. ఇప్పుడు నాలుగో సినిమాగా '90 ఎం ఎల్' అనే మాస్ మసాలా సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. మరి ఈ సినిమాతో అయినా వచ్చిన ఇమేజ్ ని నిలుపుకొని కార్తికేయ హిట్టు కొట్టి నిలబడతాడో లేదో చూడాలి.