Begin typing your search above and press return to search.

కొరటాల కు మోరల్ సపోర్ట్ గా నిలవనున్నాడా..?

By:  Tupaki Desk   |   14 July 2022 1:30 PM GMT
కొరటాల కు మోరల్ సపోర్ట్ గా నిలవనున్నాడా..?
X
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్న కొరటాల శివ.. ఈ సినిమాతో డిజాస్టర్ అందుకున్నారు. ప్లాప్ అవడమే కాదు.. డిస్ట్రిబ్యూటర్స్ కు ఊహించిన స్థాయిలో నష్టాలను తెచ్చిపెట్టింది.

'ఆచార్య' ప్రభావం మెగా తండ్రీకొడుకులు.. నిర్మాతల కంటే కొరటాల పై ఎక్కువగా పడినట్లు తెలుస్తోంది. నష్టాలన్నీ ఆయన మెడకే చుట్టుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే కొరటాల ఈ సినిమా విషయంలో దర్శకుడిగానే కాకుండా నిర్మాణంలోనూ అంతా తానై వ్యవహరించారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ మరియు మార్కెటింగ్ కూడా చూసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ నష్టాలను పూడ్చే బాధ్యత కూడా కొరటాల శివ మీదే పడిందని టాక్ వినిపిస్తోంది.

'ఆచార్య' సినిమాకు నష్టపరిహారంగా చిరంజీవి - రామ్ చరణ్ కలిసి తమ వంతుగా రూ. 20 - 25 కోట్ల వరకూ సెటిల్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ చిత్రానికి వచ్చిన నష్టాలతో పోల్చుకుంటే.. ఇవి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ తిరిగి చెల్లింపులు చేయడానికి సరిపోవు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కొరటాల పై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. నాన్ థియేట్రికల్ రూపంలో రావాల్సిన దాంట్లో కోత పడటం కూడా దర్శకుడిని ఇబ్బందుల్లో నెట్టిందని అంటున్నారు.

మొదటి నుంచి కూడా కొరటాల శివ సినిమాల వల్ల ఆర్థికంగా అందరూ లాభపడ్డవారే ఉన్నారు. దర్శకుడు కూడా మనకెందుకులే అనుకోకుండా బిజినెస్ విషయంలోనూ నిర్మాతలకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ప్రతి సినిమాకు లాభం చేకూర్చే విధంగా ఆలోచించే కొరటాల.. ఇప్పుడు 'ఆచార్య' కారణంగా కొత్త తలనొప్పులు ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ కొరటాల ఆఫీస్ కు వచ్చి నష్టపరిహారం కోసం డిమాండ్ చేసినట్లు.. కొంత మేరకు వారికి సెటిల్ చేసి పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఈ వ్యవహరమంతా కొరటాల మీద తీవ్ర ఒత్తిడి పడేలా చేసింది. అయితే ఇప్పుడు అతనికి జూనియర్ ఎన్టీఆర్ మోరల్ సపోర్ట్ గా నిలవనున్నారని టాక్ నడుస్తోంది.

కొరటాల శివ వర్క్ చేసిన హీరోలందరితో సాన్నిహిత్యం కలిగి ఉంటారనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎన్టీఆర్ - మహేష్ బాబులతో మంచి అనుబంధం ఉంది. తన తదుపరి చిత్రాన్ని తారక్ తోనే చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తన ఫ్రెండ్ సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అతి త్వరలో NTR30 ప్రారంభం కావాల్సి ఉండగా.. కొరటాల ఇప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ సెటిల్ మెంట్తో మానసికంగా ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి వచ్చింది.

ఇది తెలుసుకున్న ఎన్టీఆర్.. కొరటాలకు నైతిక మద్దతు ఇవ్వడానికి అతన్ని ప్రత్యేక సమావేశానికి ఆహ్వానించారట. కొరటాల కు తారక్ నిజాయితీ గల శ్రేయోభిలాషి కాబట్టి.. ఇలాంటి సమయంలో దర్శకుడికి మద్దతుగా నిలిచి.. ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడేసే మనో ధైర్యాన్ని అందించే అవకాశం ఉందని ఆశించవచ్చు. ఈ భారన్నంతా దింపుకున్న తర్వాత ఫ్రెష్ మైండ్ తో #NTR30 చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటారాని అభిమానులు భావిస్తున్నారు.