Begin typing your search above and press return to search.
సోషల్ మీడియా యుగంలో ప్రతిదీ న్యూసెన్సేనా?
By: Tupaki Desk | 4 Sept 2020 7:00 AM ISTసోషల్ మీడియా- డిజిటల్ యుగంలో ప్రతిదీ న్యూసెన్సేనా? అయిన దానికి కాని దానికి ఫ్యాన్స్ వీరంగం దేనికి? ఇన్ స్టా ట్విట్టర్ ఎఫ్.బీ లాంటి వేదికలపై సెలబ్రిటీలు ఖాళీగా ఉండి వేసే వెర్రి వ్యాపకాలకు అంతగా ఇదైపోవాలా? ప‌్రతిదానికి స్పందిస్తూ రిప్లయ్ లు ఇస్తూ వ్యాపకానికి కొనసాగింపును ఇవ్వాలా? ఎందుకిలా.. మరీ అంత ఖాళీగా టైమ్ వేస్ట్ చేసుకోవడంలో ఏమిటా పైశాచికానందం?
డిజిటల్ అభిమానంలో వెర్రితలలు వేయడం చూస్తుంటే.. ఇలాంటి ప్రశ్న పుట్టకుండా ఉండదు. ఇంతకుముందు అయితే తమ ఫేవరెట్ హీరో సినిమా రిలీజవుతుందంటే గంటల కొద్దీ సమయం థియేటర్ టికెట్ క్యూలైన్ లో నించునేవారు. టిక్కెట్ల కోసం కొట్లాటకు దిగేవారు. తోపుల్లాటలు ఉండేవి. కానీ ఆన్ లైన్ టికెటింగ్ అందుబాటులోకి వచ్చాక.. క్యూలైన్ టికెటింగ్ తీసేశాక ఆ గొడవల్లేవ్. అంత టైమ్ వేస్ట్ కూడా లేదు. అలాగే హీరోల్ని విమర్శించేందుకు గోడ పోస్టర్లపై పేడ పిడకలు వేసే సంస్కృతి కూడా అంతమైపోయింది.
కానీ ఇప్పుడు తిట్టుకునేందుకు కొట్టుకునేందుకు ఒక వేదిక కావాలి! అని ఎదురు చూసే వీరాభిమానులకు సోషల్ మీడియా ఒక వెర్రి వ్యాపకంగా మారింది. అక్కడ తమ అభిమాన హీరో పుట్టినరోజు పెళ్లి రోజు తద్దినం ఏదో ఒకటి వస్తే పక్క హీరో ట్వీట్ చేయలేదనో ఇన్ స్టా.. ఫేస్ బుక్ లో పోస్టింగులు పెట్టలేదనో.. ఇలా కొత్త తరహాలో కొట్టుకుంటున్నారు. దీనిని డిజిటల్ వైపరీత్యం అని అనాలో లేక ఇంకేదైనా సైకోయిజం అనాలో అర్థం కాని పరిస్థితి. చిరు - నాగార్జున ఒకరి బర్త్ డేకి ఒకరు ట్వీట్ చేయకపోతే ఇష్యూ.. కెరీర్ లో బెస్ట్ హిట్ ఇచ్చిన హీరోకి.. కాజల్ ఓ ట్వీట్ వేయలేదనో.. లేక ఇండస్ట్రీలో తన స్నేహితుల్ని మరిచే హీరోయిన్ గా మారిందనో.. ఇలా ఏదో ఒకటి అనడం అలవాటు వ్యాపకంగా మారింది. అంత పెద్ద స్టార్లు ఏదో ఏమరుపాటుగా ఒక ట్వీట్ వేయలేకపోయినా దానిపై రచ్చ చేయడం సరైన అలవాటేనా? ఎందుకీ రచ్చ? అభిమానం హద్దు మీరి సోషల్ మీడియాల్లో వెర్రి వ్యాపకాలకు దారి తీయడం సరైనదేనా? అంటే వీటికి చాలామంది వద్ద సమాధానం ఉండదు. ఎంతో ముఖ్యమైన వ్యవహారం అయితే కానీ సోషల్ మీడియాల్లో స్పందించడం సరి కాదు. ఆ పాడు వైపరీత్యంపై.. మానసిక నిపుణులు ఏమంటారో చూడాలి.