Begin typing your search above and press return to search.

కంగనా గ్యాంగ్ లో అందరూ బీజేపీ హార్డ్ కోర్ ఫ్యాన్సేనా..?

By:  Tupaki Desk   |   24 March 2021 7:30 AM GMT
కంగనా గ్యాంగ్ లో అందరూ బీజేపీ హార్డ్ కోర్ ఫ్యాన్సేనా..?
X
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పేరు వినగానే అందరికీ ఆమెకున్న ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ముందుగా గుర్తుకు వస్తుంది. సినిమాలలో తన నటనతో స్టార్ హీరోలతో సమానమైన స్థానాన్ని సంపాదించుకున్న కంగనా.. వివాదాలతో కూడా అలానే పాపులర్ అయింది. ఈ మధ్య ఇంకా ఏదొక ఇష్యూ పై ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తనకు సంబంధించిన విషయాలు.. సంబంధంలేని విషయాల గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. ఈ క్రమంలో కంగనా కేంద్ర ప్రభుత్వంపై అభిమానం చాటుకుంటూ వస్తోంది. కేంద్రం అవలంభించే విధానాలన్నీ జనానికి మేలు చేసేవేనని ప్రగాఢంగా విశ్వసిస్తూ వారు చేసే ప్రతి దానికీ మద్దతు తెలుపుతూ వస్తోంది. దీంతో ఇతర రాజకీయ పార్టీలతో బాలీవుడ్ లోని ఓ వర్గం వారితో వైరం తెచ్చుకుంది. అయితే బీజేపీ ప్రభుత్వంపై కంగనాకు అంతటి అభిమానం కలగడానికి ప్రభుత్వ పెద్దలు అండగా ఉండటమే కారణమని అందరూ చెప్పుకుంటారు.

ఇదిలా ఉండగా క్వీన్ కంగనా రనౌత్ నిన్న తన 34వ పుట్టిన రోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె సన్నిహితులు శ్రేయోభిలాషులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను వీడియోలను కంగనా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తో పాటుగా కేంద్రానికి సపోర్ట్ గా ఉండే పలువురు హాజరైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ కంగనా పుట్టినరోజు వేడుకలో అందరూ బీజేపీ డై హార్డ్ ఫ్యాన్సే కనిపిస్తున్నారే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే కంగనాకు 2020 లో పద్మశ్రీ రావడం.. 'మణికర్ణిక' ‘పంగా’ చిత్రాలకు గానూ జాతీయ ఉత్తమ నటిగా ఎంపిక కావడానికి కారణం కూడా ఆమె కేంద్రంతో సన్నిహితంగా ఉండటమే అనే కామెంట్స్ వస్తున్నాయి.