Begin typing your search above and press return to search.

'డిక్టేట‌ర్‌' కాంబో రిపీట్ కాబోతోందా..?

By:  Tupaki Desk   |   6 July 2021 8:00 AM IST
డిక్టేట‌ర్‌ కాంబో రిపీట్ కాబోతోందా..?
X
నటసింహం నందమూరి బాలకృష్ణ 60ఏళ్లకు పైబడిన వయసులో కూడా ఫుల్ ఎనర్జీతో వరుస సినిమాలు చేస్తూ దూకుడు చూపిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీగా 'అఖండ' అనే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ద్వారాక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే 'క్రాక్' డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో ఓ మూవీ అనౌన్స్ చేసాడు బాలయ్య. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై.రవి శంకర్ కలసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వాస్తవ సంఘటన ఆధారంగా ఓ పవర్ ఫుల్ స్టోరీతో ఈ సినిమా రూపొందనుంది. ఇదే క్రమంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలకృష్ణ ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అనిల్ చెప్పిన స్టోరీ లైన్ కు నటసింహం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాబోయే రోజుల్లో శ్రీవాస్ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయనున్నాడని తాజాగా ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

'లక్ష్యం' 'లౌక్యం' వంటి సూపర్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ శ్రీవాస్.. బాలకృష్ణతో ''డిక్టేట‌ర్‌'' అనే సినిమా రూపొందించాడు. 2016 సంక్రాంతి సీజన్ లో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో ఇప్పుడు బాలయ్య కోసం శ్రీవాస్ మరో స్టోరీ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. కార్పోరేట్ రాజకీయాల నేపథ్యంలో సందేశాత్మక అంశాలతో ఈ కథని సిద్ధం చేస్తున్నారట. ఇప్పటి వరకు మాస్ పాత్రల్లో మెప్పించిన నటసింహాన్ని ఇందులో శ్రీవాస్ కొత్త అవతారంలో చూపించబోతున్నారట. కిందిస్థాయి నుంచి వచ్చిన వ్యక్తి స్వయంకృషితో ఓ కంపెనీ సీఈఓ గా ఎలా ఎదిగాడు.. కార్పొరేట్ రాజ‌కీయాల్లో ఎలాంటి పాత్ర పోషించారు అనే అంశాలని ఈ కథలో ప్రస్తావిస్తున్నారట. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు. సి.కళ్యాణ్ గతంలో బాలయ్యతో 'జై సింహా' 'రూలర్' వంటి చిత్రాలను రూపొందించారు. అంతా బాగానే ఉంది కానీ ఇన్నాళ్లూ మాస్ రోల్స్ లో అలరించిన బాలకృష్ణ.. సూటూ బూటూ వేసుకొనే పాత్రలో నటిస్తే ఆడియన్స్ ఎలా తీసుకుంటారనేది ఆసక్తికరమే. ఇంతకముందు వచ్చిన 'రూలర్' సినిమాలో కూడా బాలయ్య ఓ కంపెనీ సీఈఓ గా నటిస్తే ప్రేక్షకులు తిరస్కరించారు. మరి ఇప్పుడు శ్రీవాస్ సినిమా చేసేది నిజమే అయితే ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.