Begin typing your search above and press return to search.

ఆ ఇష్యూని డైవ‌ర్ట్ చేయ‌డానికే ధ‌మ్కీని వ‌దిలాడా?

By:  Tupaki Desk   |   22 Jan 2023 2:30 AM GMT
ఆ ఇష్యూని డైవ‌ర్ట్ చేయ‌డానికే ధ‌మ్కీని వ‌దిలాడా?
X
మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ న‌టించి స్వీయ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కించిన మూవీ 'దాస్ కి ధ‌మ్కీ'. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 17న భారీ స్థాయిలో ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయ‌బోతున్నారు. సినిమాపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు విశ్వ‌క్‌. త‌న‌తో పాటు నివేదితా పేతురాజ్ కూడా ఈ మూవీ కోస‌మే ఎదురు చూస్తోంది. త‌న‌కూ బిగ్ హిట్ కావాలి.. విశ్వ‌క్ సేన్ కు కూడా అదే రేంజ్ హిట్ కావాలి.

దీంతో ఈ ఇద్ద‌రు ఈ మూవీపై భారీ ఆశ‌లే పెట్టుకున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ కు ముందు యాక్ష‌న్ కింగ్ అర్జున్ తో విశ్వ‌క్ సేన్ తో వివాదం ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. త‌న కూతురు ఐశ్వ‌ర్య‌ని హీరోయిన్ గా ప‌రిచ‌యం చేస్తూ అర్జున్ ఓ మూవీని ప‌వ‌న్ క‌ల్యాణ్ క్లాప్ తో మొద‌లు పెట్టాడు. విశ్వ‌క్ సేన్ హీరో. అయితే ఆ త‌రువాత స్క్రిప్ట్ విష‌యంలో ఇద్దిరి మ‌ధ్య మ‌నస్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో ఈ ప్రాజెక్ట్ నుంచి విశ్వ‌క్ సేన్ త‌ప్పుకున్నాడు.

రేపు షూటింగ్ అన‌గా విశ్వ‌క్ సేన్ అర్జున్ సినిమా నుంచి త‌ప్పుకోవ‌డం వివాదానికి దారి తీసింది. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఇలాంటి న‌టుడిని త‌న కెరీర్ లో చూడ‌లేద‌ని, త‌న కార‌ణంగా సినిమా ఆపేస్తున్నాన‌ని అర్జున్ ఎమోష‌న‌ల్ అయ్యాడు.

దీంతో వివాదం కాస్త ముదిరింది. అయితే ఈ వివాదంపై ఓ చిన్న సినిమా ప్రెస్ మీట్ లో స్పందించిన విశ్వ‌క్ సేన్ త‌న‌కు అర్జున్ ఫ్రీడ‌మ్ ఇవ్వ‌లేద‌ని, త‌న‌ని న‌మ్మ‌మంటూ చెబుతూ వ‌చ్చార‌ని ఏం జ‌రుగుతోందో తెలియ‌క‌పోవ‌డంతో తాను ఫైన‌ల్ గా సినిమా నుంచి త‌ప్పుకున్నాని తెలిపాడు విశ్వ‌క్ సేన్‌.

చివ‌రి నిమిషంలో చెప్ప‌డం త‌న త‌ప్పేన‌ని ఒప్పుకోవ‌డంతో వివాదం స‌ద్దుమ‌నిగింది. అయితే ఈ వివాదం స‌ద్దుమ‌న‌గాలంటే విశ్వ‌క్ సేన్ త‌న 'దాస్ కా ధ‌మ్కీ'ని రంగంలోకి దింపాల‌నుకున్నాడట‌. అనుకున్న‌ట్టుగానే ట్రైల‌ర్ ని రిలీజ్ చేశాడు. ఆ త‌రువాత లిరిక‌ల్ వీడియోల‌ని బ్యాక్ టు బ్యాక్ వ‌ద‌ల‌డంతో అంతా అర్జున్ వివాదాన్ని ప‌క్క‌న పెట్టి వీటి గురించే మాట్లాడుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఒక సినిమా ప్ర‌మోష‌న్స్ ని నెల రోజుల ముందుగా మాత్ర‌మే మొద‌లు పెడ‌తారు.

అది కూడా భారీ సినిమా అయితేనే.. కానీ విశ్వ‌క్ సేన్ మాత్రం 'దాస్ కా ధ‌మ్కీ' ప్ర‌మోష‌న్స్ ని దాదాపు రెండు నెల‌ల ముందుగానే మొద‌లు పెట్టేసిన విష‌యం తెలిసిందే. యాక్ష‌న్ కింగ్ అర్జున్ కు త‌న‌కు మ‌ధ్య జ‌రిగిన వివాదం నుంచి దృష్టి మ‌ళ్లించాల‌న్న ఆలోచ‌న‌లో భాగంగానే విశ్వ‌క్ సేన్ 'దాస్ క ధ‌మ్కీ' మూవీ ప్ర‌మోస‌న్స్ ని రెండు నెల‌ల ముందుగానే మొద‌లు పెట్ట‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.