Begin typing your search above and press return to search.

థ‌ర్డ్ వేవ్ ని ఎదుర్కొనేందుకు చిరు CCC సిద్ధ‌మా?

By:  Tupaki Desk   |   11 Sep 2021 8:30 AM GMT
థ‌ర్డ్ వేవ్ ని ఎదుర్కొనేందుకు చిరు CCC సిద్ధ‌మా?
X
క‌రోనా క్రైసిస్ ఆప‌త్కాలంలో నేనున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి ప‌రిశ్ర‌మ కార్మికుల కోసం `క‌రోనా క్రైసిస్ చారిటీ` (సీసీసీ)ని ప్రారంభించి విశిష్ఠ సేవ‌ల్ని అందించారు. కార్మికుల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను అందించ‌డ‌మే గాక‌.. ఇండ‌స్ట్రీలో పేద‌లు బ‌డుగుల‌కు ఆప‌న్నహ‌స్తం అందించారు. క‌ష్టంలో ఉన్న‌ ఆర్టిస్టులు 24 శాఖ‌ల్లోని పేద‌లంద‌రికీ త‌న‌వంతు ఆర్థిక విరాళాల్ని అందించారు. చాలా మందికి ల‌క్ష‌ల్లో డొనేష‌న్ల‌తో చెక్కుల్ని పంపించారు. క‌రోనాతో బాధ‌ప‌డే ఎంద‌రికో ఆస్ప‌త్రుల్లో బెడ్స్ ని ఏర్పాటు చేసారు. హైద‌రాబాద్ వెలుప‌ల ఉన్న‌వారికి ఈ సేవ‌లు అందాయి. సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆక్సిజ‌న్ అంద‌క చ‌నిపోతున్న రోగుల కోసం చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకులను స్థాపించింది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లోనూ ఇవి అందుబాటులోకి వ‌చ్చి ఎంద‌రో ప్ర‌జ‌ల‌ ప్రాణాల్ని కాపాడాయి.

సినీప‌రిశ్ర‌మ 24 శాఖ‌లు మెగాస్టార్ సేవ‌ల్ని కొనియాడాయి. ఇప్ప‌టికీ చిరు సేవ‌లు కొన‌సాగుతున్నాయి. సీసీసీ త‌ర‌పున ప‌రిశ్ర‌మ కార్మికులు స‌హా 24శాఖ‌ల్లోని వారికి వ్యాక్సినేష‌న్ స‌జావుగా సాగేందుకు ఏర్పాట్లు చేశారు. చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ వ‌ద్ద ప‌రిశ్ర‌మ వ్య‌క్తుల‌కు వ్యాక్సినేష‌న్ జ‌రుగుతోంది. అన్నిశాఖ‌ల‌తో పాటు ఫిల్మ్ క్రిటిక్స్ సభ్యులకు రెండవ డోస్ వాక్సినేషన్ కార్యక్రమం కొన‌సాగింది. కొద్దిరోజులుగా ఈ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం దిగ్విజ‌యంగా సాగుతోంది. వేలాదిగా ప‌రిశ్ర‌మ వ్య‌క్తులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వ‌ద్ద ఈ సేవ‌ల్ని స‌ద్వినియోగం చేసుకున్నారు. వాక్సిన్ వేయించుకోని సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా సీసీసీ సేవ‌కులు కోర‌గా స్పంద‌న అద్భుతంగా వ‌చ్చింది. నిన్న‌టివ‌ర‌కూ ఈ సేవ‌లు కొన‌సాగాయి.

వ్యాక్సినేష‌న్ మొద‌టి డోస్ తో పాటు రెండో డోస్ సేవ‌ల్ని కూడా ఇక్క‌డ దిగ్విజ‌యంగా అందించారు. అయితే చిరు సీసీసీ కి మునుముందు ఇంకా స‌వాళ్లు ఎదురు కానున్నాయా? అంటే అవున‌నే గుస‌గుస వినిపిస్తోంది. అక్టోబ‌ర్ నాటికి థ‌ర్డ్ వేవ్ వ‌స్తుంద‌ని అప్ప‌టికి సీసీసీ ప‌దింత‌ల సాయం చేయాల్సి ఉంటుంద‌ని కూడా ఫిలింన‌గ‌ర్ లో గుస‌గుసలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం సినిమాల షూటింగులు బెరుకు లేకుండా సాగుతున్నాయి. ప్ర‌జ‌లంతా మాస్కులు లేకుండానే రోడ్ల‌పై తిరిగేస్తున్నారు. మాల్స్ పార్కులు స్కూల్స్ అన్నీ తెరుచుకున్నాయి. అందుకే మ‌హ‌మ్మారీ మ‌రోసారి అదుపుతప్పితే గ‌నుక ముంద‌స్తు ఏర్పాట్లు చేయ‌ని ప్రభుత్వాల‌ను న‌మ్మ‌లేని ప‌రిస్థితి ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు. అయితే స‌న్నివేశం ఎలా ఉన్నా ఎదుర్కొనేందుకు సీసీసీ ఏం చేస్తుందో చూడాల‌ని అంటున్నారు. మొద‌టి వేవ్ లో నిత్యావ‌స‌రాలు సినీకార్మికుల్ని కాపాడాయి. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ బ్యాంకులు ఆదుకున్నాయి. కొన్ని ప్రాణాల్ని కాపాడాయి. థ‌ర్డ్ వేవ్ లో ముప్పును ఎదుర్కొనేందుకు మ‌రోసారి సీసీసీ చేయాల్సింది చాలా ఉంద‌నేది ప‌రిశ్ర‌మ వ‌ర్గాల అలాగే సామాన్య ప్ర‌జ‌ల‌ భావ‌న‌. ఇక‌పైనా సేవ‌లు ఇలానే కొన‌సాగుతాయ‌నే ఆశిస్తున్నారు. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. ఆయ‌న నాలుగు సినిమాల్ని చిన్న పాటి గ్యాప్ ల‌తోనే ప‌ట్టాలెక్కించే ప్లాన్ చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.