Begin typing your search above and press return to search.

హలో.. చైతన్యను కూడా పెట్టేశారా??

By:  Tupaki Desk   |   27 Nov 2017 3:38 PM GMT
హలో.. చైతన్యను కూడా పెట్టేశారా??
X
మొదటి సినిమాతో చతికిలబడిన అక్కినేని అఖిల్.. రెండో సినిమా కోసం సంవత్సరన్నర టైమ్ తీసుకున్నాడు కాని.. తీసుకుంటే తీసుకున్నాడు అనే తరహాలో ఇప్పుడు హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్లు మరియు ట్రలైర్ తో ఇంప్రెస్ చేసిన అఖిల్.. ఇప్పుడు ఈ సినిమాలో ఇంకా చాలా సర్పరైజింగ్ ఎలిమెంట్స్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. వాటిలో ముఖ్యంగా సినిమాలో తన ఫ్యామిలీనంతా క్యాస్టింగ్ చేశాడని అనుకుంటున్నారు.

ఇష్క్ అండ్ మనం సినిమాతో తన టాలెంటును టాలీవుడ్కు కొత్త తరహాలో పరిచయం చేసిన విక్రమ్ కె కుమార్.. ఇప్పుడు అఖిల్ తో ''హలో'' అంటూ వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ బాగానే ఇంప్రెస్ చేసింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు.. కొత్త హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్.. అదిరిపోయారంతే. అయితే ఈ సినిమాలో ఇప్పుడు సమంత అండ్ అక్కినేని అమల ఉన్నారంటూ గాసిప్స్ ఎప్పటినుండో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు మనం చేస్తున్నప్పుడు కేవలం ఒక హీరోయిన్ మాత్రమే అయిన సమంత ఇప్పుడు కోడలు కూడా. కాబట్టి ఇద్దరు అక్కినేని కోడళ్లూ ఉన్నారంటూ టాక్ వినిపిస్తోంది.

అదంతా సరే కాని.. అసలు చూస్తుంటే మనోళ్లు మరోసారి మనం సినిమా తరహాలో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తూనే ఉంది. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ నాగార్జున కాబట్టి.. ఆయన ఖచ్చితంగా సినిమా ప్రమోషన్లలో భారీ హంగామా చేస్తారు. మరి అందరూ కనిపించి.. చైతన్యను వదిలేస్తారా అంటే.. మనోడ్ని కూడా ఏదన్నా సీన్లో గెస్టుగా చేయించే ఉంటారు అంటున్నారు సన్నిహితులు. నిజంగానే ఏదో ఫ్రేములో చై తో హలో చెప్పించారా? అతడ్ని కూడా సినిమాలో పెట్టేశారా? చూద్దాం.