Begin typing your search above and press return to search.

బన్నీ బాలీవుడ్ ప్లాన్స్ లో ఉన్నాడా ?

By:  Tupaki Desk   |   23 Aug 2019 11:02 AM IST
బన్నీ బాలీవుడ్ ప్లాన్స్ లో ఉన్నాడా ?
X
ఏమో జరుగుతున్న సంఘటనలు చూస్తే అదే అనిపిస్తోంది. ఇటీవలే విడుదలై బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంశలతో పాటు వసూళ్లు కూడా బాగానే తెచ్చుకుంటున్న బాట్లా హౌస్ దర్శకుడు నిఖిల్ అద్వాని ఇచ్చిన పార్టీకి అల్లు అర్జున్ హాజరవడం కొత్త చర్చకు దారి తీస్తోంది. పోనీ అదేమైనా రీమేక్ చేసే ప్లాన్ లో ఉన్నాడా అంటే ఆ సబ్జెక్ట్ కాని అందులోని నేటివిటీ కాని మన ఆడియన్స్ కు బన్నీ ఇమేజ్ కు సెట్ అయ్యేవి కావు.

అలాంటప్పుడు ఈ పార్టీకి వెళ్ళడం చూస్తే బాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నట్టు దానికి డైరెక్టర్ గా నిఖిల్ అద్వానినే కోరుతున్నట్టుగా రకరకాల ఊహాగానాలు మొదలైపోయాయి. ఇప్పటికే రామ్ చరణ్ ఓసారి జంజీర్ రూపంలో ఓ ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు. మళ్లి ఇంకోసారి సాహసం చేసే ఉద్దేశంలో కూడా లేడు. మరి బన్నీ ఆలోచన ఎలా ఉందో ఏమిటో అసలే మన సౌత్ హీరోలు హిందిలో జెండా పాతడం చాలా తక్కువ.

చిరంజీవి అంతటివాడే మూడు సినిమాలు చేసి వర్క్ అవుట్ కాదని మానుకున్నారు. నాగార్జున వెంకటేష్ లు చెరి రెండు చేసి ఇక్కడికే పరిమితమయ్యారు. బాలకృష్ణ ప్రయత్నం కూడా చేయలేదు. యూత్ హీరోల్లో ప్రభాస్ ఒక్కడికే బాహుబలి వల్ల అక్కడ మార్కెట్ దక్కింది. ఇప్పుడు రాబోయే సాహోతో అసలు స్టామినా బయటపడుతుంది. సౌత్ స్టార్లకు ఇంత క్లిష్టంగా ఉన్న బాలీవుడ్ లోకి బన్నీ నిజంగా అడుగుపెట్టాలనే ఉద్దేశంలో ఉన్నాడా లేక ఏదైనా ఇతర కారణం వల్ల బాట్లా హౌస్ సక్సెస్ పార్టీలో కనిపించాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.