Begin typing your search above and press return to search.
అక్కినేని హీరోలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మల్టీస్టారర్ సాధ్యమేనా..?
By: Tupaki Desk | 18 Nov 2020 9:15 AM ISTఅక్కినేని హీరోలంతా కలిసి 'మనం' అనే మెమరబుల్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు నుంచి అఖిల్ వరకూ అందరూ ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్ రాలేదు. అయితే గత కొన్ని రోజులుగా కింగ్ నాగార్జున - అఖిల్ ఓ భారీ మల్టీస్టారర్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వరుస విజయాలతో దూకుడుమీదున్న మోస్ట్ సక్సెస్ ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వీరిద్దరినీ కలిపి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది.
అనిల్ ఈ ఏడాది ఆరంభంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత 'ఎఫ్2' సీక్వెల్ గా 'ఎఫ్3' కి స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. అయితే ప్రస్తుతం వెంకటేష్ - వరుణ్ తేజ్ బిజీగా ఉండడంతో ఈ సినిమా స్టార్ట్ కావడానికి మరికొంత సమయం పడుతుందట. ఈలోగా మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్న అనిల్.. నాగ్ - అఖిల్ కోసం కథ రెడీ చేసాడట. ఇప్పటికే నాగార్జునకు కూడా స్టోరీ లైన్ నచ్చిందని.. పూర్తి కథ సిద్ధం చేసే పనిలో అనిల్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడని.. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు.
ఆఅయితే ఈ క్రేజీ మల్టీస్టారర్ ఇప్పట్లో సాధ్యమేనా అనే అనుమానం కలుగుతోంది. అఖిల్ అక్కినేని ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. దీని తర్వాత స్టయిలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఓ సినిమా చేయనున్నాడు. మరోవైపు నాగార్జున కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న 'వైల్డ్ డాగ్' షూటింగ్ ఇటీవలే పూర్తి చేశాడు. దీని తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నాడు. అలానే కళ్యాణ్ కృష్ణ తో 'బంగార్రాజు' సినిమా లైన్ లో ఉంది. ఇప్పుడు నాగ్ - అఖిల్ కమిట్మెంట్స్ పూర్తయ్యే లోపు అక్కడ 'ఎఫ్3' హీరోలు ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇప్పట్లో ఈ మల్టీస్టారర్ కుదిరే పనేనా అని కామెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం అక్కినేని అభిమానులకు పండుగే అని చెప్పాలి. మరి ఈ మల్టీస్టారర్ కి శ్రీకారం చుడతారో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.