Begin typing your search above and press return to search.

సితారలో బెల్లంకొండ సినిమా నిజ‌మేనా?

By:  Tupaki Desk   |   10 March 2022 2:30 AM GMT
సితారలో బెల్లంకొండ సినిమా నిజ‌మేనా?
X
బెల్లంకొండ శ్రీ‌నివాస్ త‌న పంథాని మార్చుకున్నారా?.. కొత్త పంథాలో సినిమాలు చేస్తున్నారా? అంటే తాజా ప‌రిణామాలని బ‌ట్టి టాలీవుడ్ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. గ‌త ఏడాది బెల్లంకొండ శ్రీ‌నివాస్ న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'అల్లుడు అదుర్స్' తీవ్ర నిరాశ‌ని క‌లిగించింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ ఎలాంటి ఇంపాక్ట్ ని క‌లిగించ‌లేక‌పోయింది. సంతోష్ శ్రీ‌నివాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం భారీ విజ‌యాన్ని అందించిన 'అల్లుడు శ్రీ‌ను' సెంటిమెంట్ ని రిపీట్ చేస్తుంద‌ని భావించారు కానీ అలా జ‌ర‌గ‌లేదు.

దీంతో ఆలోచ‌న‌లో ప‌డిన బెల్లంకొండ శ్రీ‌నివాస్ త‌న పంథాని మార్చుకుని 'ఛ‌త్ర‌ప‌తి' రీమేక్ తో బాలీవుడ్ బాట ప‌డుతున్నారు. వీవీ వినాయ‌క్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని జ‌యంతిలాల్ గ‌డ అత్య‌తం భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఈ మూవీతో పాటు స్టూవ‌ర్ట్ పురం బందిపోటు దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవిత క‌థ ఆధారంగా 'స్టూవ‌ర్ట్ పురం దొంగ‌' పేరుతో పాన్ ఇండియా మూవీని ప్ర‌క‌టించారు. ఈ మూవీ ద్వారా వివివినాయ‌క్ శిష్యుడు కెఎస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు.

శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ భారీ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించాల‌ని ప్లాన్ చేశారు. అయితే ఈ మూవీ ఇంత వ‌ర‌కు ప‌ట్టాలెక్క‌లేదు. 'ఛ‌త్ర‌ప‌తి' హిందీ రీమేక్ కార‌ణంగా ఈ మూవీ షూటింగ్ ని వాయిదా వేస్తున్నారా? లేక ఇదే క‌థ‌తో మాస్ మ‌హారాజా ర‌వితేజ 'టైగ‌ర్ నాగేశ్వ‌రరావు' పేరుతో చేయ‌బోతున్న సినిమా కార‌ణంగా ఆపేశారా? అన్న‌ది ఇప్ప‌డు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా వినిపిస్తోంది.

ఇదిలా వుంటే 'ఛ‌త్ర‌ప‌తి' హిందీ రీమేక్ అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ లో వుండ‌గానే హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఓ పాన్ ఇండియా మూవీ చేయ‌బోతున్నార‌ని, దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై యువ నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించ‌బోతున్న‌ట్టుగా ప్ర‌చారం మొద‌లైంది. దీనికి ఓ స్టార్ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని కూడా చెబుతున్నారు. ఈ వార్త‌లో నిజ‌మెంత అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప‌రోక్షంగా బెల్లంకొండ సురేష్ అండ‌గా వుంటూ బెల్లంకొండ‌ శ్రీ‌నివాస్ తో సినిమాలు చేస్తున్నార‌ని ఇండ‌స్ట్రీలో టాక్ ఎప్ప‌టి నుంచో వినిపిస్తోంది.

ఈ నేఫ‌థ్యంలో సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ లో బెల్లంకొండ శ్రీ‌నివాస్ సినిమా అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. బెల్లంకొండ వెన‌కాల వుండి ఈ ప్రాజెక్ట్ ని నిర్మించ‌బోతున్నారా? .. లేక బెల్లంకొండ శ్రీ‌నివాస్ చిత్రాల‌కు ఉత్త‌రాదిలో క్రేజ్ వుండ‌టం వ‌ల్లే త‌న‌తో సినిమాకు రెడీ అయిపోతున్నారా? ఇంత‌కీ సితార‌లో బెల్లంకొండ సినిమా అన్న‌ది ఎంత వ‌ర‌కు నిజం? అని నెట్టింట ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఇటీవ‌ల బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌ని సొంతం చేసుకుంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ల్యాణ్ తో 'భీమ్లానాయ‌క్‌'. సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ‌తో 'డీజే టిల్లు' సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ అందించిన‌వే కావ‌డం విశేషం.