Begin typing your search above and press return to search.

'B.కామ్ లో ఫిజిక్స్' కూడా అలాంటి సినిమాయేనా...?

By:  Tupaki Desk   |   23 July 2020 5:00 AM IST
B.కామ్ లో ఫిజిక్స్ కూడా అలాంటి సినిమాయేనా...?
X
టాలీవుడ్ విభిన్న‌మైన టైటిల్స్ పెట్ట్ యూత్ ని ఎట్రాక్ట్ చేసే సినిమాలు తీసే డైరెక్టర్స్ లో శ్యామ్ జే చైత‌న్య‌ ఒకరు. 'ఆవు పులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి' 'ఏడు చేప‌ల క‌థ' లాంటి వెరైటీ టైటిల్స్ తో ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించేలా చేసాడు. ఈ క్రమంలో ఇప్పుడు 'B.కామ్ లో ఫిజిక్స్' అనే టైటిల్ తో సినిమా అనౌన్స్ చేసారు. 'బి.కామ్‌ లో ఫిజిక్స్' అనే డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడే ఇదే క్యాచీ డైలాగ్ ని సినిమాకి టైటిల్ గా పెట్టేసారు. ఈ చిత్రాన్ని రెడ్ కార్పెట్ రీల్ ప్రోడ‌క్ష‌న్ బ్యాన‌ర్ లో తెలుగుతో పాటు హిందీలో కూడా విడుద‌ల చేస్తున్నారు. అంకిత రాజ్‌ పుత్‌, య‌శ్వంత్, సునీల్‌, మేఘ‌నా చౌద‌రి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.

ఇంతకముందు వీరు రూపొందించిన 'ఏడు చేప‌ల క‌థ' కూడా అడల్ట్ కంటెంట్ తో వచ్చిన సినిమానే. ఈ అడల్ట్ సినిమాని థియేట‌ర్ లో ప్రేక్షకులు ఆదరించకపోయినా యూట్యూబ్ లో మాత్రం ఓ వర్గం ఆడియన్స్ చూసారు. ట్రైలర్ ని బట్టి చూసే ఇది బూతు సినిమా అని కొంతమంది దూరంగా ఉంటే.. ట్రైలర్ చూసి ఏదో ఉంటుందని ఎక్సపెక్ట్ చేసిన వారిని కూడా నిరాశపరిచింది. ఇప్పుడు 'B.కామ్ లో ఫిజిక్స్' చిత్రం 'ఏడు చేప‌ల క‌థ' కంటే మూడింత‌లు బోల్డ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి బూతు సినిమాలు తియ్యడం ఎందుకని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓటీటీలను నమ్ముకునే ఇలాంటి అడల్ట్ కంటెంట్ తో సినిమాలు తీస్తున్నారని అంటున్నారు. అయితే ఇదే బ‌డ్జెట్ తో కొంద‌రు దర్శకనిర్మాతలు అద్భుతమైన సినిమాలు రూపొందిస్తున్నారు. మరి ఇలాంటి సినిమాలు తీసే వారు కూడా కాస్త అటుగా ఆలోచిస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు.