Begin typing your search above and press return to search.

సిటీమార్‌ తో బిబి అఖిల్‌ కోరిక నెరవేరబోతున్నట్లేనా?

By:  Tupaki Desk   |   14 March 2021 3:30 AM GMT
సిటీమార్‌ తో బిబి అఖిల్‌ కోరిక నెరవేరబోతున్నట్లేనా?
X
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 రన్నరప్ గా నిలిచిన అఖిల్ సార్దక్ కు మంచి గుర్తింపు లభించింది. బిగ్ బాస్ కు ముందు చాలా తక్కువ గుర్తింపు ఉన్న అఖిల్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపును దక్కించుకున్నాడు. ఇప్పటికే వెబ్‌ సిరీస్ లో నటిస్తున్న అఖిల్ ఒక సినిమా లో కూడా నటించేశాడు. ఆ విషయాన్ని ఇన్నాళ్లు బయటకు చెప్పలేదు కాని సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆ విషయాన్న రివీల్‌ చేశారు. అఖిల్‌ కనిపించబోతున్న సినిమా గోపీచంద్‌.. తమన్నా నటించిన సిటీమార్‌. సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్‌ 2వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

బిగ్‌ బాస్ లో ఉన్న సమయంలో తనకు సినిమాల్లో నెగటివ్ రోల్స్‌ చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చిన అఖిల్‌ తన కోరికను నెరవేర్చుకోబోతున్నాడు. అఖిల్‌ 'సిటీమార్‌' సినిమాలో సెకండ్ హాఫ్‌ లో నెగటివ్‌ షేడ్స్ ఉండే పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఒక కబ్బడ్డీ బ్యాక్ గ్రౌండ్‌ మూవీ కనుక అఖిల్‌ ఈ సినిమా లో కబడ్డీ ప్లేయర్ గానే కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. బిగ్ బాస్ తో మంచి గుర్తింపు దక్కించుకున్న అఖిల్ ఈ సినిమా లో నటించడం వల్ల సినిమాకు మరియు అతడికి కూడా అదనపు ప్లస్‌ అవ్వడం ఖాయం అంటున్నారు.