Begin typing your search above and press return to search.

మ‌న్మ‌థుడు త‌ర్వాత చిరు బాల‌య్య ఆఫ‌ర్లు

By:  Tupaki Desk   |   8 Aug 2020 10:00 AM IST
మ‌న్మ‌థుడు త‌ర్వాత చిరు బాల‌య్య ఆఫ‌ర్లు
X
వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది ర‌కుల్ ప్రీత్ సింగ్. ఆరంభం యువ హీరోల స‌ర‌స‌న న‌టించింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా స్టార్ హీరోలు ఆఫ‌ర్లు ఇచ్చి ఎంక‌రేజ్ చేశారు. ర‌కుల్ ఒడ్డు పొడుగు చూసి మ‌హేష్‌-చ‌ర‌ణ్-బ‌న్ని-ఎన్టీఆర్ లాంటి టాప్ రేంజ్ స్టార్లు అవ‌కాశాలు ఇవ్వ‌డంతో అమ్మ‌డి రేంజు స్కైని ట‌చ్ చేసింది. కానీ అంత‌లోనే ఉన్న‌ట్టుండి ఎందుక‌నో రేసులో వెన‌క‌బ‌డిపోయింది.

నాగార్జున స‌ర‌స‌న మ‌న్మ‌థుడు 2లో కాస్త హ‌ద్దుమీరి ఎక్స్ పోజ్ చేసింద‌న్న టాక్ వినిపించింది. ఆ సినిమా ప‌రాజ‌యం పాల‌వ్వ‌డంతో అది త‌న కెరీర్ కి మైన‌స్ అయ్యింది. ఆ త‌ర్వాత మ‌రో తెలుగు సినిమా ఆఫ‌ర్ లేనే లేదు. అలాంటి టైమ్ లో ల‌క్కీగా `భార‌తీయుడు 2`లో రెండో లీడ్ లో న‌టించే అవ‌కాశం అందుకుంది.

తాజా స‌మాచారం ఏమిటంటే ర‌కుల్ సీనియ‌ర్ల‌కు వ‌రుస పెట్టి సంత‌కాలు చేయ‌నుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. త‌దుప‌రి చిరంజీవి - బాలకృష్ణ లాంటి సీనియ‌ర్ల స‌ర‌స‌న న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ట‌. ఇప్ప‌టికే క‌థానాయిక‌లు దొరక్క వెట‌ర‌న్స్ కి ఇబ్బందిక‌రంగా ఉంది. ఆ క్ర‌మంలోనే ర‌కుల్ పేరును త‌దుప‌రి చిత్రాల కోసం ప‌రిశీల‌న‌లోకి తీసుకుంటున్నార‌ట‌. ఆ ర‌కంగా ర‌కుల్ కెరీర్ కి తిరిగి బూస్ట్ దొరుకుతోంద‌న్న‌మాట‌. నాగార్జున‌.. క‌మ‌ల్ హాస‌న్ లాంటి సీనియ‌ర్ల‌తో న‌టించ‌డం ర‌కుల్ కి ఒక ర‌కంగా క‌లిసొస్తోందన్న‌మాట‌.