Begin typing your search above and press return to search.

చైనా..అమెరికాలో 'అవ‌తార్ -2' పై దెబ్బ పడిన‌ట్లే!

By:  Tupaki Desk   |   20 Dec 2022 5:45 AM GMT
చైనా..అమెరికాలో అవ‌తార్ -2 పై దెబ్బ పడిన‌ట్లే!
X
జేమ్స్ కామెరూన్ విజువ‌ల్ వండ‌ర్ 'అవతార్ 2' భారీ అంచ‌నాల మ‌ధ్య డిసెంబ‌ర్ 16న రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. రెండ‌వ భాగం కూడా మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు వ‌సూళ్లు న‌మోదు చేస్తుంద‌ని అంతా భావించారు. వారంతంలో అవతార్ -2 వ‌సూళ్లు చూసి అంతా నివ్వెర పోవాల్సిందేని ఒకటే హైప్ క్రియేట్ అయింది. అప్ప‌టి అవ‌తార్ మొద‌టి భాగం రికార్డును 'అవెంజ‌ర్స్ ఎండ్ గ్రేమ్' బ్రేక్ చేసిన నేప‌థ్యంలో ..అదే అవెంజ‌ర్ రికార్డును అవ‌తార్-2 బ్రేక్ చ‌య‌డం ఖాయ‌మ‌నుకున్నారు.

కానీ ఇక్క‌డ సీన్ మ‌రోలా క‌నిపిస్తుంది. వారాంతంలో బాక్స్ ఆఫీస్ వ‌ద్ద మ్యాజిక్ చేస్తుందని భావించిన సమయంలో.. ఈ చిత్రం $ 500 మిలియన్ల మార్కును కూడా టచ్ చేయడంలో విఫలమైంది.

'అవెంజర్స్: ఎండ్ గేమ్' యొక్క 'ఫస్ట్ వీకెండ్' రికార్డ్‌ను తాక‌డానికి ఈ చిత్రానికి మైళ్ల దూరమే క‌నిపిస్తుంది. అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ వారంతంలోనే $1.2 బిలియన్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే మొదటి 3 రోజుల్లో $500 మిలియన్లను డార్ల‌ను వ‌సూళ్ల‌ను సాధించింది.

కానీ 'అవ‌తార్' ఆ రికార్డుల‌ను న‌మోదు చేయ‌డం లో విఫ‌ల‌మైన‌ట్లే క‌నిపిస్తుంది. చైనా..అమెరికా దేశాల్లో ప్ర‌తికూల వాతావ‌ర‌ణంలో ఈసినిమా రిలీజ్ అయింది. ఇదే అవ‌తార్-2 వ‌సూళ్ల‌పై పెద్ద ప్ర‌భావాన్ని చూపిన‌ట్లు క‌నిపిస్తుంది. వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సంక్షోభం తర్వాత పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. తాజాగా అవే ప‌రిస్థితులు మ‌ళ్లీ ఆరెండు దేశాల్లో క‌నిపిస్తున్నాయి.

చైనాలో అన‌ధారిక నివేదిల‌క ప్ర‌కారం ఆ దేశం మళ్లీ కోవిడ్ బారిన పడిందని అంతర్జాతీయ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. దీంతో దేశంలోని దాదాపు 30% సినిమా థియేటర్లు మూసివేయబడ్డాయని స‌మాచారం. మిగిలిన థియేటర్లు కేవలం 50% ఆక్యుపెన్సీ నిబంధనతో పనిచేస్తున్నాయట‌. అందుకే అవతార్ 2 అక్కడ అత్యల్ప కలెక్షన్స్ సాధిస్తుస్తున్న‌ట్లు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

అలాగే అమెరికాలో అవ‌తార్ -2 రిలీజ్ కి ఇది స‌రైన స‌మ‌యం గా భావించ‌డం లేదు. కోవిడ్ భ‌యం స‌హా.. క్రిస్మ‌స్ సెల‌వులు కావ‌డంతో ప్ర‌జ‌లంతా ఆ వేడుక‌ల్లో బిజీ అవుతున్నారు. పైగా తీవ్ర‌మైన ఎముకులు కొరికే చ‌లి కార‌ణంగా ప్రేక్ష‌కుల‌కు థియేట‌ర్ కు రావ‌డానికి ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని వినిపిస్తుంది. కానీ సినిమాకు మంచి మౌత్ టాక్ రావడంతో వ‌సూళ్లు గ‌ణ‌నీయంగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని వినిపిస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.