Begin typing your search above and press return to search.

అట్లీతో విజ‌య్ 68..డ‌బుల్ హ్యాట్రిక్ పై క‌న్ను!

By:  Tupaki Desk   |   4 Jan 2023 11:30 PM GMT
అట్లీతో విజ‌య్ 68..డ‌బుల్ హ్యాట్రిక్ పై క‌న్ను!
X
త‌ల‌ప‌తి విజ‌య్-అట్లీ మ‌రోసారి చేతులు కలుపుతున్నారా? ఈ ద్వ‌యం డబుల్ హ్యాట్రిక్ పై క‌న్నేసిందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఈస‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. గ‌తంలో 'థేరి'..'మెర్స‌ల్'..'బిజిల్' లాంటి చిత్రాల‌తో వ‌రుస‌గా తొలి హ్యాట్రిక్ న‌మోదు చేసారు. ఆ మూడు వ‌సూళ్ల‌తో బాక్సా పీస్ ని షేక్ చేసిన చిత్రాలు. ఆ విజ‌యాల‌తోనే అట్లీ స్టార్ లీగ్ లో చేరిపోయాడు.

ఆ స‌క్సెస్ చూసే బాలీవుడ్ బాద్ షా 'జ‌వాన్' సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం క‌ల్పించారు. టాలీవుడ్ హీరోలు సైతం అట్లీతో ప‌నిచేయ‌డానికి రెడీగా ఉన్నారు. కానీ అత‌న్ని విజ‌య్ వ‌దిలిపెట్టేలా లేడు. వ‌రుస‌గా ఆయ‌న‌తో డ‌బుల్ హ్యాట్రిక్ న‌మోదు చేసే వ‌ర‌కూ మ‌రో హీరోకు నో ఛాన్స్ అనేస్తున్నాడు. విజ‌య్ 68వ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా మ‌రోసారి అట్లీనే ఫైన‌ల్ చేసిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

అట్లీ వీకిపీడియాలో సైతం ఈ విష‌యాన్ని అప్ డేట్ చేసారు. ఈసినిమా షూటింగ్ జూన్ లో మొద‌లు పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అదే నిజ‌మైతే ఈ కాంబోలో ఇది నాల్గ‌వ సినిమా అవుతుంది. మ‌రో రెండు సినిమాలు చేసి హిట్ అందుకుంటే డ‌బుల్ హ్యాట్రిక్ ఖాతాలో ప‌డిన‌ట్లే. ఈ ద్వ‌యం ఆవిష‌యంలో ఏమాత్రం త‌గ్గ‌ద‌ని చెప్పొచ్చు.

ప్ర‌స్తుతం విజ‌య్ లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్ స్ట‌ర్ నేప‌థ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో కోలీవుడ్ స్టార్స్ కొంద‌రు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఆ ర‌కంగా ఇది భారీ కాన్వాస్ పై రూపొందుతుంది. అలాగే సంక్రాంతి కానుకుగా 'వార‌సుడు' సినిమాతో టాలీవుడ్లో నూ విజ‌య్ లాంచ్ అవుతున్నాడు.

దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. రిలీజ్ అదే స్థాయిలో జ‌రుగుతుంది. ఇక అట్లీ బాలీవుడ్ లో 'జ‌వాన్' షూట్ లో త‌ల మున‌కలై ఉన్నాడు. ఆ సినిమా పూర్తి చేయ‌డానికి ఇంకా నాలుగు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంది. ఆ త‌ర్వాత విజ‌య్-అట్లీ సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.