Begin typing your search above and press return to search.

అనుష్క మెగా సినిమాను రిజెక్ట్ చేసిందా?

By:  Tupaki Desk   |   22 March 2020 11:31 AM IST
అనుష్క మెగా సినిమాను రిజెక్ట్ చేసిందా?
X
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో 'ఆచార్య' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడంటే కరోనా కారణంగా షూటింగు వాయిదా పడింది కానీ అది లేకుండా ఉంటే 'ఆచార్య' షూటింగ్ యమా జోరుగా జరుగుతూ ఉండేది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరు సరసన నటించే హీరోయిన్ విషయం ఓ హాట్ టాపిక్ గా మారింది.

మొదట ఈ సినిమాకు త్రిషను హీరోయిన్ గా ఎంచుకోవడం.. తర్వాత త్రిష 'ఆచార్య' నుంచి తప్పుకోవడం అందరికీ తెలిసిన విషయాలే. త్రిష తప్పుకున్న తర్వాత కొరటాల శివ టీమ్ కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా ఖరారు చేశారు. అయితే కాజల్ ను సంప్రదించడానికి ముందు మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలు జరిగాయని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. చిరు కోసం అనుష్కతో సంప్రదింపులు జరిగాయని.. అనుష్కకు ఈ ప్రాజెక్ట్ పై పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడతో వర్క్ అవుట్ కాలేదట. అనుష్క మెగా ఆఫర్ కు మొహమాటంతో 'నేను నటించను' అని చెప్పలేకపోయిందట. అందుకే భారీ పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చెయ్యడంతో 'ఆచార్య' టీమ్ అనుష్కకు బదులుగా కాజల్ ను ఫైనలైజ్ చేశారని ప్రచారం సాగుతోంది.

మరి ఈ వెర్షన్ లో ఎంతమాత్రం నిజం ఉందో తెలియదు కానీ అనుష్కకు 'ఆచార్య' ఆఫర్ వచ్చిన మాట మాత్రం వాస్తవమేనని అంటున్నారు. ఇదిలా ఉంటే అనుష్క 'నిశ్శబ్దం' తర్వాత మరే ఇతర సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. 'నిశ్శబ్దం' త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది.