Begin typing your search above and press return to search.

ఇప్పట్లో తారక్ - త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా సాధ్యమయ్యేనా..?

By:  Tupaki Desk   |   22 Jun 2021 8:00 AM IST
ఇప్పట్లో తారక్ - త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా సాధ్యమయ్యేనా..?
X
'అరవింద సమేత వీర రాఘవ' వంటి సినిమా సూపర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలసి హీరో చిత్రం చేయాలని నిర్ణయించునున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై 'NTR30' రూపొందనుందని అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీనికి 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ పూర్తైన వెంటనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తారని అనుకుంటుండగా.. ఎవరూ ఊహించని విధంగా తారక్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో కొరటాల శివతో ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని ప్రకటించడం.. మహేష్ బాబుతో త్రివిక్రమ్ ఓ ప్రాజెక్ట్ కమిట్ అవ్వడం జరిగిపోయాయి. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ అవడానికి స్పష్టమైన కారణం తెలియనప్పటికీ.. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఇది జరిగిందని వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని గుసగుసలు వినిపించాయి. అయితే వీరి మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని.. ఇద్దరూ ఇప్పటికీ మంచి సంబంధాన్ని కొనసాగిస్తున్నారని ఇప్పుడు సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు వీరి కాంబోలో మరో సినిమా రానుందని అంటున్నారు.

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ప్రస్తుతం కమిటైన ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత కలిసి ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారట. కాకపోతే తారక్.. కొరటాల శివతో పాటుగా ప్రశాంత్ నీల్ తో ఓ భారీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు పూర్తవడానికి రెండేళ్లకు పైగా సమయం పట్టనుంది. దీనికి తోడు మరికొందరు దర్శకులు లైన్ లో ఉన్నారు. మరోవైపు మహేష్ సినిమా తరువాత చరణ్ లేదా చిరంజీవితో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే ఇప్పట్లో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఒకవేళ SSMB28 తర్వాత త్రివిక్రమ్ ఫ్రీ అయినా.. తారక్ మాత్రం ఇప్పట్లో తారక్ దొరకడం కష్టమే. మరి భవిష్యత్ లో వీరి కలయికలో సినిమా వస్తుందేమో చూడాలి.