Begin typing your search above and press return to search.

మరో మాస్‌ సరైనోడు కన్ఫర్మ్‌ అయినట్లేనా?

By:  Tupaki Desk   |   27 May 2021 4:37 AM GMT
మరో మాస్‌ సరైనోడు కన్ఫర్మ్‌ అయినట్లేనా?
X
అల్లు అర్జున్‌ కెరీర్‌ లో మాస్ సూపర్‌ హిట్ గా నిలిచిన సరైనోడు సినిమా ఎప్పటికి ప్రత్యేకమే అనడంలో సందేహం లేదు. బన్నీ లోని మాస్ ఎలిమెంట్స్ ను దర్శకుడు బోయపాటి శ్రీను చూపించినట్లుగా అంతకు ముందు ఏ దర్శకుడు చూపించలేదు అనడంలో సందేహం లేదు. బన్నీ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా సరైనోడు సినిమాకు కనెక్ట్‌ అయ్యారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించేందుకు సరైనోడు తర్వాత చాలా మంది స్టార్‌ హీరోలు ఆసక్తి చూపించారు. కాని ఆయన వినయ విధేయ రామ సినిమా తో తీవ్రంగా నిరాశ పర్చాడు. దాంతో ఆయనకు కాస్త గ్యాప్ వచ్చింది.

ప్రస్తుతం బాలయ్యతో అఖండ సినిమా ను తెరకెక్కిస్తున్న బోయపాటి ఆ తర్వాత చేయబోతున్న సినిమా పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అఖండకు వచ్చిన బజ్ నేపథ్యంలో ఆయనతో తదుపరి సినిమాలకు పలువురు స్టార్స్ ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ఈయన రవితేజ మరియు అల్లు అర్జున్‌ లతో దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల అల్లు అరవింద్ మరియు అల్లు అర్జున్ లకు బోయపాటి కథ చెప్పడం.. నచ్చడం అన్ని చకచక జరిగాయట. ప్రస్తుతం బన్నీ కమిట్ అయ్యి ఉన్న ప్రాజెక్ట్‌ లను పూర్తి చేసుకున్న తర్వాత బోయపాటి తో సినిమా ఉండే అవకాశం ఉందంటున్నారు.

సొంత బ్యానర్‌ లో అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించేందుకు ఒప్పుకున్నాడు అంటే కథ ఆయన్ను ఎంతగా మెప్పించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ తో సరైనోడు తరహా లో మాస్‌ మసాలా మూవీనే మళ్లీ బోయపాటి చేయబోతున్నాడు. వినయ విధేయ రామ చిత్రంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుని అల్లు అరవింద్ కాస్త శ్రద్దగా ఈ సినిమాను నిర్మిస్తే ఖచ్చితంగా బోయపాటి మరో సరైనోడును బన్నీకి ఇవ్వడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.