Begin typing your search above and press return to search.

హీరో, నిర్మాత మద్య దోబూచులాట

By:  Tupaki Desk   |   29 July 2019 2:03 AM GMT
హీరో, నిర్మాత మద్య దోబూచులాట
X
ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌, యూత్‌ లో యమ క్రేజ్‌ ఉన్న హీరో అతడు. తాజాగా కూడా ఒక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరో వైపు అతడు ఇప్పటికే రెండు సినిమాలకు కమిట్‌ అయ్యి ఉన్నాడు. ఆ రెండు సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఇదే సమయంలో ఆ హీరో వద్దకు పలువురు నిర్మాతలు డేట్ల కోసం వస్తూనే ఉన్నారు. తాజాగా ఒక టాలీవుడ్‌ టాప్‌ నిర్మాత ఒకరు ఆయన వద్దకు వెళ్లాడట. ఆ నిర్మాత బ్యానర్‌ లో సినిమాలు చేయాలని ప్రతి ఒక్క హీరో అనుకుంటారు.

స్టార్‌ హీరోలు సైతం ఆ నిర్మాతకు నో చెప్పలేని పరిస్థితి. అలాంటి నిర్మాతకు ఈ క్రేజీ హీరో దూరంగా ఉంటున్నాడు. కారణాలు చెప్పకుండానే సినిమా విషయం తెస్తే తర్వాత చూద్దాం అంటూ సమాధానం దాట వేస్తున్నాడట. ఒక మంచి కథతో వెళ్లినా కూడా ఆ నిర్మాతకు డేట్లు ఇచ్చేందుకు సదరు హీరో ఆసక్తిగా లేడని తెలుస్తోంది. అదే కథతో మరే నిర్మాత అయినా వెళ్లి ఉంటే వెంటనే ఓకే చెప్పే వాడని కూడా అంటున్నారు.

ఆ నిర్మాత మరియు హీరోల మద్య ప్రస్తుతం దోబూచులాట జరుగుతుంది. డైరెక్ట్‌ గా నిర్మాతకు హీరో నో చెప్పడం లేదు. నిర్మాత మాత్రం వదలడం లేదు. ఆ క్రేజీ హీరోతో సినిమా నిర్మించి క్యాష్‌ చేసుకోవాలని ఆయన తాపత్రయం. కాని ఆ హీరో మాత్రం చిక్కడం లేదు. ఇంతకు ఆ నిర్మాతకు హీరో దూరంగా ఉండటంకు కారణం ఏంటీ అనే విషయమై ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నిర్మాత మాత్రం ఆ హీరో కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు.