Begin typing your search above and press return to search.

అల్లు శిరీష్ త్వ‌ర‌లో ప‌ప్ప‌నం పెట్ట‌బోతున్నాడా?

By:  Tupaki Desk   |   22 Oct 2022 2:30 AM GMT
అల్లు శిరీష్ త్వ‌ర‌లో ప‌ప్ప‌నం పెట్ట‌బోతున్నాడా?
X
మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ త‌న‌యుడు అల్లు శిరీష్ సినిమా చేసి దాదాపు రెండేళ్లు దాటింది. మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ 'ఏబీసీడీ అమెరిక‌న్ రిట‌ర్న్డ్ క‌న్ఫ్యూజ్డ్ దేసీ' ఆధారంగా 2019లో అల్లు శిరీష్ న‌టించిన మూవీ 'ఏబీసీడీ'. ఈ మూవీ త‌రువాత కొంత విరామం తీసుకున్న అల్లు శిరీష్ తాజాగా న‌టించిన రొమాంటిక్ ల‌వ్ స్టోరీ 'ఊర్వ‌శివో రాక్ష‌సివో'. రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా అను ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్ గా న‌టించింది.

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో కొత్త నిర్మాత నిర్మించిన ఈ మూవీ న‌వంబ‌ర్ 4న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్ లో హీరో అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్ ల కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. గ‌త కొన్ని రోజులుగా వీరిద్ద‌రు డేటింగ్ లో వున్నారంటూ వార్త‌లు మొద‌ల‌య్యాయి.

అయితే ఈ వార్త‌ల‌పై తాజాగా ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా అల్లు శిరీష్ క్లారిటీ ఇచ్చాడు. న‌టీన‌టుల జీవితాల్లో ఇలాంటి వ‌దంతులు స‌ర్వ‌సాధార‌ణం. కోస్టార్ తో తాను ప్రేమ‌లో వున్న‌ట్టు వార్త‌లు రావ‌డం స‌హ‌జ‌మే. గ‌తంలోనూ నా గురించి ఇలాంటి వార్త‌లే వ‌చ్చాయి.

నిజం చెప్పాలంటే మా ఇద్ద‌రి మ‌ధ్య అలాంటిది ఏమీ లేదు. మేమిద్ద‌రం మంచి స్నేహితులం. కొన్ని నెల‌ల పాటు క‌లిసి ప‌ని చేశాం కాబ‌ట్టి మా ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింది. అదీకాక తను చాలా సైలెంట్‌. మా ఇద్ద‌రి వ్య‌క్తిత్వాలు ఒకేలా వుంటాయి. దాని వ‌ల్ల మేమిద్ద‌రం ఎక్క‌వ‌గా మాట్లాడుకోవ‌డానికి అవ‌కాశం ఏర్ప‌డింది. వ‌ర్క్ విష‌యంలో త‌ను చాలా ప్రొఫెష‌నల్ గా వుంటుంది. అందువ‌ల్లే రొమాంటిక్ సీన్స్ చేసేట‌ప్పుడు ఇబ్బందిప‌డ‌లేదు' అని వివ‌ర‌ణ ఇచ్చాడు.

ఇదిలా వుంటే ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం శుక్ర‌వారం రాజ‌మండ్రి వెళ్లిన అల్లు శిరీష్ అక్క‌డ ఫ్యాన్స్ తో క‌లిసి హంగామా చేశాడు. ఈ సంద‌ర్భంగా అభిమానులు శిరీష్ కు త‌మ కోరిక‌ని వివ‌రించారు. మెగా హీరోలంతా క‌లిసి ఓ సినిమా చేస్తూ చూడాల‌ని వుంద‌ని.. అది మా ఆశ అని అభిమానులు త‌మ కోరిక‌ని వ్య‌క్తం చేశారు.

దీనికి స‌మాధానంగా శిరీష్ మాట్లాడుతూ 'అది జ‌రిగే ఆనందించే వ్య‌క్తుల్లో ముందు నేనే వుంటాన‌ని, అయితే ఒక‌టి, రెండేళ్ల‌లో పెళ్లి చేసుకోబోతున్నాన‌ని, ఆ సంద‌ర్భంగా మెగా హీరోలంతా క‌లుస్తామ‌ని చెప్ప‌డంతో ఫ్యాన్స్ అంతా హ‌ర్షాద్వానాలు చేశారు. మ‌రి ఫ్యాన్స్ కోరిన‌ట్టే మెగా 'మ‌నం' కార్య‌రూపం దాల్చేనా.. అందుకు హీరోలంతా ప‌చ్చ‌జెండా ఊపేస్తారా? అన్న‌ది వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.