Begin typing your search above and press return to search.
పుష్ప లుక్ మార్చుతున్నారా?
By: Tupaki Desk | 7 May 2020 12:40 PM ISTఅల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందబోతున్న చిత్రం ‘పుష్ప’. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అలాగే అల వైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న బన్నీ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పుష్ప చిత్రంలో బన్నీ లుక్ ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చారు. బన్నీ బర్త్ డే సందర్బంగా టైటిల్ ను రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. చాలా మాసీగా మాసిన గడ్డంతో నిజంగా ఎర్రచందనం స్మగ్లర్ మాదిరిగానే బన్నీ కనిపించాడు.
అల్లు అర్జున్ లుక్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. సుకుమార్ మరోసారి రంగస్థలం రేంజ్ హిట్ ను కొట్టడం ఖాయంగా అంతా భావించారు. సినిమా ఎప్పుడెప్పుడు షూటింగ్ ప్రారంభం అవుతుంది.. ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే పుష్ప చిత్రంలో బన్నీ లుక్ మార్చబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఫస్ట్ లుక్ లో చూపించిన దాని కంటే కాస్త ఎక్కువ గడ్డంతో పాటు జుట్టు కూడా మరింత ఎక్కువగా ఉంటుందట.
లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా షూటింగ్స్ లేవు. ఇంకా ఎన్ని రోజులకే షూటింగ్స్ ప్రారంభం అయ్యేనో చెప్పలేని పరిస్థితి. అప్పటి వరకు బన్నీ గడ్డం మరియు జుట్టు మరింత పెరిగే అవకాశం ఉంది. కనుక దాన్ని అలాగే కంటిన్యూ చేసి దర్శకుడు సుకుమార్ బన్నీని కొత్తగా చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. ఫస్ట్ లుక్ కోసం ఫొటో షూట్ చేసిన సమయంలో బన్నీకి ఉన్న జట్టు తక్కువే. ఆ సమయంలో షూటింగ్ ప్రారంభిస్తే అదే లుక్ తో వెళ్లే వారు.
కాని ఇప్పుడు కాస్త జుట్టు పెరగడంతో పాటు గడ్డం కూడా కాస్త ఎక్కువ అవ్వడంతో సుకుమార్ ఆలోచన మార్చుకున్నాడట. రంగస్థలం చిత్రంలో చరణ్ గడ్డం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో కూడా ఫస్ట్ లుక్ లో చూపించినదాని కంటే కూడా అధనంగా బన్నీ గడ్డం ఉంటుందనే వాదన వినిపిస్తుంది. అసలు విషయం ఏంటీ అనేది షూటింగ్ సమయంకు క్లారిటీ రాదు.