Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రిపైనా అంత న‌మ్మ‌క‌మా అలియా?

By:  Tupaki Desk   |   6 Feb 2022 5:36 AM GMT
ఆ ఇద్ద‌రిపైనా అంత న‌మ్మ‌క‌మా అలియా?
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- కొర‌టాల శివ కాంబినేష‌న్ లో క్రేజీగా మ‌రో చిత్రానికి రంగం సిద్ధ‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. `ఆచార్య` రిలీజ్ కాగానే ఈ కాంబినేష‌న్ మూవీ ప‌ట్టాలెక్క‌నుంది. అయితే మ‌రోవైపు సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు అత్యంత వేగంగా జ‌రుగుతున్నాయి. య‌థావిథిగా కొరటాల పాత టెక్నిక‌ల్ టీమ్ నే కొన‌సాగిస్తున్నా.. న‌టీన‌టుల ఎంపిక‌లో మాత్రం ఫ్రెష్ ఫీల్ త‌ప్ప‌నిస‌రి. దీనిలో భాగంగా ఎన్టీఆర్ కి జోడీగా అలియా భ‌ట్ ని లాక్ చేసారు. అలియా భ‌ట్ కూడా ఈ విష‌యాన్ని ధృవీక‌రించింది. ఇది నిజంగా ఊహించ‌ని స‌ర్ ప్రైజ్. అలియా భ‌ట్ న‌టిస్తోన్న `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ కాకుండా ఈ బ్యూటీ రెండ‌వ సినిమా వెంట‌నే అంగీక‌రించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

అయితే ఇలా అలియాభ‌ట్ ని లాక్ చేయ‌డం వెనుక ఎన్టీఆర్ కీల‌క పాత్ర‌ధారి అని తెలుస్తోంది. మ‌రో ఆస‌క్తిక‌ర సంగ‌తేంటంటే ఈ సినిమా స్క్రిప్ట్ అయినా విన‌కుండా అలియాభ‌ట్ న‌టించ‌డానికి అంగీక‌రిచింద‌ని ప్ర‌చారం సాగుతోంది. కొర‌టాల శివ‌..ఎన్టీఆర్ ల‌పై ఉన్న న‌మ్మ‌కంతోనే అలియాభ‌ట్ క‌నీసం లైన్ కూడా విన‌కుండా లాక్ చేసింద‌ట‌. ఇదే స‌మ‌యంలో బాలీవుడ్ లో ఓ సినిమాకి సంత‌కం చేసింది అలియా. కానీ ఆ సినిమా నేరేష‌న్ మొత్తం విన్న త‌ర్వాతే అంగీక‌రించింది. తార‌క్ కోసం మాత్రం కొర‌టాల స్క్రిప్ట్ విన‌కుండా.. తార‌క్ అడ‌గ‌గానే మ‌రోమాట చెప్ప‌కుండా ఎస్ అనే మాట వ‌చ్చింద‌ని తెలుస్తోంది.

కార‌ణాలు ఏవైనా తార‌క్- అలియాని ఇంప్రెస్ చేయ‌డం విశేషం. `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో అలియాభ‌ట్ రామ్ చ‌ర‌ణ్ కి జోడీగా న‌టించింది. తార‌క్ తో ఎలాంటి స‌న్నివేశాలు లేవు. ఆన్ సెట్స్ లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య అంత బాండింగ్ లేదు. కానీ ఆఫ్ ది స్ర్కీన్ తార‌క్ చ‌లాకీత‌నంతో అలియాని ఎలా ఇంప్రెస్ చేసి ఉంటాడు? అన్న‌ది `ఆర్ ఆర్ ఆర్` ముంబై ప్ర‌మోష‌న్ లో బ‌య‌ట‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. తెలుగు సినిమా పాన్ ఇండియాని దాటి పాన్ వ‌ర‌ల్డ్ కి రీచ్ అవుతోన్న నేప‌థ్యం..నిర్మాణ వ్య‌యం భారీగా పెంచ‌డంతో ప‌ల‌వురు బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు చిత్రాల‌పై ఆస‌క్తిగా ఉన్నారు. `ప్రాజెక్ట్ -కె`లో ప్ర‌భాస్ స‌ర‌స‌న దీపికా ప‌దుకొణే ఎంపికైన సంగ‌తి తెలిసిందే.