Begin typing your search above and press return to search.

RRR నుంచి బిగ్ వికెట్ డౌన్‌ ?

By:  Tupaki Desk   |   23 Aug 2020 10:50 AM IST
RRR నుంచి బిగ్ వికెట్ డౌన్‌ ?
X
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ఆర్.ఆర్.ఆర్ క‌రోనా మ‌హ‌మ్మారీ వ‌ల్ల ఇబ్బందుల్లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. పెండింగ్ షూటింగ్ పూర్తి చేయాల‌నుకున్నా రాజ‌మౌళికి సాధ్యం కావ‌డం లేదు. ఆయ‌న ఇటీవ‌లే కోవిడ్ కి చికిత్స పొంది ఆరోగ్య‌వంతుల‌య్యారు. దీంతో మ‌రింత జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌తిదీ ఈ సినిమాపై ప్ర‌భావం చూపించేదే.

క‌నీసం ఇప్ప‌టికి అయినా వ్యాక్సిన్ కానీ టీకా కానీ అందుబాటులోకి వ‌చ్చి ఉంటే చాలా వ‌ర‌కూ భ‌యం త‌గ్గేది. కానీ ప‌రిష్కారం ఇంకా క‌నుగొన‌లేదు. దీంతో మ‌హ‌మ్మారీ అంత‌కంత‌కు విజృంభిస్తోంది. ముంబైలో ఈ ప‌రిణామం మరింత తీవ్రంగా ఉంది.

కార‌ణం ఏదైనా.. ఈ ప్రాజెక్టు నుంచి ముంబై బ్యూటీ ఆలియాభ‌ట్ వైదొల‌గింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తాను ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆర్.ఆర్.ఆర్ కు కాల్షీట్లు కేటాయించ‌లేన‌ని ఆలియా చెప్పార‌ట‌. అయితే ఇది నిజ‌మా? అంటే దీనిపై రాజ‌మౌళి నుంచి కానీ చిత్ర యూనిట్ లో ఎవ‌రో ఒక‌రి నుంచి కానీ క‌న్ఫ‌ర్మేష‌న్ రాలేదు. ఇంత‌కుముందు కూడా ఆలియా త‌ప్పుకుంది అంటూ ర‌క‌ర‌కాలుగా ప్ర‌చార‌మైనా అదేదీ నిజం కాలేదు.

నిజానికి ఆలియా త‌ప్పుకుంటే ఆ పాత్ర‌లో ఎవ‌రిని రీప్లేస్ చేస్తారు? అన్న‌దానిపైనా ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రియాంక చోప్రా లేదా దీపిక ప‌దుకొనేని సంప్ర‌దించే వీలుంద‌న్న వాద‌నా వినిపిస్తోంది. సెప్టెంబ‌ర్ నుంచి చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లాల్సి ఉండ‌గా.. ఈ డైలమా నిజ‌మా కాదా? అన్న‌ది చిత్ర‌బృందమే చెప్పాల్సి ఉంటుంది.