Begin typing your search above and press return to search.

అక్కినేని కోడ‌లుకి ఆ ఇద్ద‌రూ స్ఫూర్తి?

By:  Tupaki Desk   |   17 Jun 2019 5:30 AM GMT
అక్కినేని కోడ‌లుకి ఆ ఇద్ద‌రూ స్ఫూర్తి?
X
అక్కినేని కోడ‌లు స‌మంత స్టైల్ ఐక‌న్ అన్న సంగ‌తి తెలిసిందే. ద‌క్షిణాదిన అగ్ర క‌థానాయిక‌గానే కాదు గొప్ప ఫ్యాష‌నిస్టాగానూ వెలిగిపోతున్నారు. సామ్ ఏ డ్రెస్ ధ‌రించినా .. బ్రాండెడ్ యాక్సెస‌రీస్ ని కొనుక్కున్నా వాటిని యూత్ ఎంతో జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తుంది. న‌వ‌త‌రంలో త‌న‌కు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. అయితే సామ్ ఫ్యాష‌న్స్ విష‌యంలో ఎవ‌రిని అనుస‌రిస్తారు? తాను ఎంచుకునే డ్రెస్ డిజైన్ .. బ్రాండ్స్.. యాక్సెస‌రీస్ ఇలా ఏది ప‌రిశీలించినా సామ్ ఫాలో చేస్తారు? అంటే .. ఇంచుమించు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. అనుష్క శ‌ర్మ ల‌ను అనుస‌రిస్తార‌ని అభిమానులు విశ్లేషిస్తుంటారు.

కేవ‌లం ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్ లోనే కాదు వ్య‌క్తిగ‌త వృత్తిగ‌త వ్య‌వ‌హారాల్లో ఆ ఇద్ద‌రినీ అనుస‌రించేందుకు స‌మంత ఆస‌క్తిగా ఉంటార‌ని విశ్లేషిస్తున్నారు. పీసీ .. అనుష్క శ‌ర్మ ఆల్రెడీ శ్రీ‌మ‌తులు అయ్యారు కాబ‌ట్టి.. వారినే మిసెస్ స‌మంత అక్కినేని కూడా ఫాలో అవుతున్నారా? అంటూ యువ‌త‌రంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. పెళ్లి త‌ర్వాత కెరీర్ ని కొన‌సాగిస్తూ బాలీవుడ్ భామ‌ల త‌ర‌హాలోనే కెరీర్ ని సాగిస్తున్న‌ స‌మంత .. ట్రెండ్ ని ఫాలో అవ్వ‌డంలోనూ ఆ ఇద్ద‌రికీ ఏమాత్రం తీసిపోవ‌డం లేదు.

వ‌స్త్ర‌ధార‌ణ‌లో సాంప్రదాయ బ‌ద్ధంగా క‌నిపించినా ట్రెండీ లుక్ తో ఆక‌ట్టుకోవ‌డంలో పీసీ తో పోలిస్తే సామ్ త‌క్కువేమీ కాదు. ఇక కెరీర్ ప‌రంగా చూస్తే పెళ్లి త‌ర్వాతా అనుష్క శ‌ర్మ నిర్మాత‌గా న‌టిగా స‌క్సెస‌య్యారు. అదే బాట‌లో స‌మంత ప్ర‌యాణిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. ప్ర‌తి ఒక్క‌రికీ రోల్ మోడ‌ల్స్ ఉంటారు. వారి బాటలో వెళ్లేందుకు ప్ర‌య‌త్నించి స‌క్సెస‌వ్వ‌డం ఇంపార్టెంట్. సామ్ చేస్తున్న‌ది అదే. ఇటీవ‌లే హ‌బ్బీ నాగ‌చైత‌న్య తో క‌లిసి సమంత న‌టించిన మ‌జిలీ ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రూ క‌లిసి ప‌లు చిత్రాల్లో న‌టించేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. స‌మంత న‌టించిన ఓ బేబి త్వ‌ర‌లో రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.