Begin typing your search above and press return to search.

ఆ సినిమా విషయంలో అఖిల్ హ్యాపీగా ఉన్నాడా..??

By:  Tupaki Desk   |   8 March 2021 7:30 AM GMT
ఆ సినిమా విషయంలో అఖిల్ హ్యాపీగా ఉన్నాడా..??
X
యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓ రొమాంటిక్ లవ్ స్టోరీగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అయితే పరుగు మూవీ తర్వాత మరో హిట్ అందుకోలేదు డైరెక్టర్ భాస్కర్. అలాగే హీరో అఖిల్ ఇప్పటికి కెరీర్ ఫస్ట్ హిట్టు కోసమే వెయిట్ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై ఇద్దరూ భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే ఈ మూవీకి ఫస్ట్ నుండి ఏదోకటి ప్రాబ్లెమ్ ఫేస్ చేయాల్సి వస్తోంది. నిజానికి గతేడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది సంక్రాంతికు వాయిదాపడింది. తీరా సంక్రాంతికి రిలీజ్ అనేసరికి మరో ప్రాబ్లెమ్.. అదే రీషూట్.

ఎందుకంటే షాదీ ముబారక్ అనే మూవీ కూడా బ్యాచిలర్ మూవీని పోలి ఉండటం. నిజానికి షాదీ ముబారక్ సినిమా గురించి ఎవరికీ సరిగ్గా తెలియదు. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు(సాగర్) హీరోగా నటించిన ఈ సినిమా కథ దాదాపు ఎలిజిబుల్ బ్యాచిలర్ లాగే ఉంటుందని టాక్ వచ్చింది. అందుకని మళ్లీ ఇద్దరూ ఒకేలా తీస్తే దెబ్బతినే అవకాశం ఉందని గ్రహించి.. డైరెక్టర్ భాస్కర్ టీమ్ మళ్లీ బ్యాచిలర్ మూవీ సెకండ్ హాఫ్ స్టోరీలో మార్పులు చేసి కొత్తగా స్క్రిప్ట్ రాసి రీషూట్ చేశారు. అయితే తాజాగా షాదీ ముబారక్ విడుదలై బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. అటు సాంగ్స్, ట్రైలర్ ఇలా ఏవి కూడా సినిమాకు ఫేమ్ తేలేకపోయాయి. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై పరాజయం పాలైంది. ప్రేక్షకులు కూడా పెద్దగా ఉత్సాహం చూపట్లేదని టాక్. అయితే ఈ విషయం తెలిసి అఖిల్ హ్యాపీగా ఉన్నట్లు పలు కథనాలు చెబుతున్నాయి. సేమ్ స్టోరీ అయితే సినిమా ఫెయిల్ అయ్యేదని ముందే గ్రహించి చేంజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు మార్పులు చేశారు కాబట్టి అఖిల్ హ్యాపీ అని సమాచారం. ఈ సినిమాను బన్నీవాసు, వాసువర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.