Begin typing your search above and press return to search.

‘ఐ’ మత్తు ఇంకా వదిలినట్లు లేదే..

By:  Tupaki Desk   |   18 April 2016 4:02 AM GMT
‘ఐ’ మత్తు ఇంకా వదిలినట్లు లేదే..
X
దక్షిణాది సినీ పరిశ్రమలో ఉన్న గొప్ప నటుల్లో విక్రమ్ ఒకడు. కమల్ హాసన్ తర్వాత ఇండియాలో గొప్ప గొప్ప ప్రయోగాలు చేసిన నటుడు విక్రమే అని చెప్పాలి. సేతు.. శివపుత్రుడు.. అపరిచితుడు.. నాన్న.. ఐ.. ఇలా ఏ సినిమా చూసినా విక్రమ్ ఎంతటి ప్రత్యేకమైన నటుడో అర్థమైపోతుంది. ఐతే ‘అపరిచితుడు’ తర్వాత విక్రమ్ స్థాయికి తగ్గ సినిమా ఒక్కటీ రాకపోవడం అతడి అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. మూడేళ్లకు పైగా ఎంతో కష్టపడి చేసిన ‘ఐ’ మూవీ చేదు అనుభవాన్ని మిగల్చడం విక్రమ్ కంటే కూడా అతడి అభిమానుల్ని ఎక్కువ బాధపెట్టింది. దీని తర్వాత వచ్చిన ‘10 ఎన్రదుకుల్లా’ కూడా విక్రమ్ ను ఫ్లాపుల నుంచి బయట పడేయలేదు.

ఐతే అరిమా నంబి (తెలుగులో డైనమైట్) లాంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన కొత్త సినిమా ‘ఇరు ముగన్’ మాత్రం అతడి జాతకాన్ని మార్చేలాగే కనిపిస్తోంది. విక్రమ్ 50వ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ‘ఇరుముగన్’ టీజర్.. జనాల్లో సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉంది. విక్రమ్ ఇందులో ఓ ఫైటర్‌ పాత్రను పోషిస్తున్నాడు. గడ్డంతో.. పొడవాటి జుట్టుతో ఇప్పటిదాకా ఎన్నడూ కనిపించని కొత్త లుక్‌ లో దర్శనమిస్తున్నాడు విక్రమ్. హ్యారిస్ జైరాజ్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ టీజర్ కు మేజర్ హైలైట్. హీరోయిన్లు నయనతార.. నిత్యామీనన్.. సరికొత్త లుక్స్ లో దర్శనమిస్తున్నారు. ఐతే టీజర్ చివర్లో కొసమెరుపులాగా విక్రమ్ ను ఓ కొత్త అవతారంలో చూపించాడు దర్శకుడు. ఇది చూస్తుంటే మళ్లీ ‘ఐ’ ఛాయలు కనిపిస్తున్నాయి. తన సినిమాలు ఎలాంటి ఫలితాన్నిచ్చినా సరే.. ఏదో ఒక ప్రయోగం చేయకుండా విక్రమ్ వదలడని టీజర్ చూస్తే అర్థమవుతోంది. మరి ఈ సినిమా అయినా విక్రమ్‌ ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.