Begin typing your search above and press return to search.

హాస్పిటల్ నుంచి క్రికెట్ గ్రౌండ్

By:  Tupaki Desk   |   30 May 2018 2:30 PM GMT
హాస్పిటల్ నుంచి క్రికెట్ గ్రౌండ్
X
తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ అసలు బ్రతుకుతాడా లేదా అనే స్థితిలో చికిత్స కోసం లండన్ వెళ్లిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మెల్లగా కోలుకుంటున్నాడు . వాస్తవ ప్రపంచంలోకి వస్తున్నాడు. గత రెండు నెలలకు పైగా ఎటువంటి అప్ డేట్ లేకుండా ఆందోనళ చెందుతున్న అభిమానులకు సంతోషం కలిగేలా వార్త రావడంతో సన్నిహితులు కూడా ఊరట చెందుతున్నారు. ఇంగ్లాండ్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూస్తుండగా ఒక అభిమాని తన కెమెరాలో బంధించడంతో ఇది బయటికి వచ్చింది. దానికి తోడు తన కొత్త సినిమా కార్వాన్ గురించి విషెస్ చెబుతూ బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్న దుల్కర్ సల్మాన్ తో పాటు టీమ్ కు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలియజేస్తూ మెసేజ్ చేయటంతో ఇర్ఫాన్ పూర్తిగా కోలుకున్నారు అనే నిర్ధారణకు వచ్చినట్టే. తన ఆరోగ్యం గురించి పూర్తిగా వివరాలు చెప్పలేదు కానీ బాగుండటం వల్లే కదా అంత రద్దీ ఉండే క్రికెట్ మ్యాచ్ వస్తాడు అనే అంచనాలో ఉన్నారు అందరు.

ఇర్ఫాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ బ్లాక్ మెయిల్ ఇటీవలే విడుదలై కమర్షియల్ గా పర్వాలేదు అనిపించుకుంది. తన వరకు పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్న ఇర్ఫాన్ ఖాన్ కొత్త సినిమా కార్వాన్ ఆగష్టులో విడుదల అవుతుంది. తనతో సినిమాలు ఆగిపోయిన దర్శక నిర్మాతలు ఎప్పుడెప్పుడు ఇర్ఫాన్ వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. విశాల్ భరద్వాజ్ తో పాటు సుజిత్ సిర్కార్ క్యూలో ముందు వరసలో ఉన్నారు. వీళ్ళతో చేశాకే ఇర్ఫాన్ ఖాన్ వేరే కమిట్మెంట్స్ గురించి ఆలోచించగలడు. తెలుగులో మహేష్ బాబు సైనికుడులో విలన్ గా నటించిన ఇర్ఫాన్ ఖాన్ ఆ తర్వాత సౌత్ సినిమాలు చేయలేకపోయాడు. లాస్ట్ ఇయర్ చేసిన వాటిలో హిందీ మీడియం- కరీబ్ కరీబ్ సింగల్ సింగల్ మంచి విజయం సాధించి పేరు కూడా తెచ్చిపెట్టాయి.