Begin typing your search above and press return to search.

తెలుగులో మ‌రోసారి ఇర్ఫాన్‌ఖాన్‌?!

By:  Tupaki Desk   |   15 Oct 2015 4:53 PM GMT
తెలుగులో  మ‌రోసారి ఇర్ఫాన్‌ఖాన్‌?!
X
బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ మ‌రోసారి తెలుగులో న‌టించ‌బోతున్నాడా? అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. మంచి న‌టుడిగా గుర్తింపు పొందిన ఇర్ఫాన్‌ఖాన్ బాలీవుడ్‌లో బిజీ బిజీగా కొన‌సాగుతున్నారు. ఆయ‌న‌కి హాలీవుడ్ సినిమాల్లో న‌టించే ఆఫ‌ర్లు కూడా అప్పుడ‌ప్పుడు ప‌ల‌క‌రిస్తుంటాయి. అలాంటి న‌టుడు తెలుగులో న‌టించ‌డానికి ఓకే చెప్ప‌డ‌మంటే విశేష‌మే క‌దా! ఇర్ఫాన్ ఇదివ‌ర‌కు `సైనికుడు`లో న‌టించాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడే తెలుగులో న‌టించేందుకు ఒప్పుకొన్నాడు.

ఇంత‌కీ ఇర్ఫాన్‌ఖాన్ న‌టించ‌నున్న తెలుగు సినిమా ఏదో తెలుసా? మోహన్ లాల్. గౌతమి జంట‌గా చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న కొత్త సినిమాలో. వారాహి చలనచిత్రం ప‌తాకంపై తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ఆ సినిమా రూపుదిద్దుకోబోతోంది. త్వ‌ర‌లోనే చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్ల‌బోతున్నారు. ఇందులో ఓ కీల‌క పాత్ర కోసం విల‌క్ష‌ణమైన న‌టుడు కావాల‌నుకొన్నార‌ట‌. ఆ పాత్ర గురించి ఇర్ఫాన్ ఖాన్‌కి చెప్ప‌డం, ఆయ‌న వెంట‌నే ఓకే చెప్ప‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయ‌ట‌. అన్న‌ట్టు ఈ సినిమాలో మోహ‌న్‌లాల్, గౌత‌మిల‌తో పాటు పేరున్న ఓ యువ‌జంట కూడా న‌టించ‌బోతోంద‌ట‌. ఆ జంట ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. త్వ‌ర‌లోనే ఆ జంట వివ‌రాల్ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయి.