Begin typing your search above and press return to search.

ఇంటర్‌పోల్‌ ఆఫీసరుగా మారనున్న మాజీ స్టార్ క్రికెటర్!!

By:  Tupaki Desk   |   30 July 2020 11:30 PM GMT
ఇంటర్‌పోల్‌ ఆఫీసరుగా మారనున్న మాజీ స్టార్ క్రికెటర్!!
X
స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం కోబ్రా. సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. దాదాపు ఈ సినిమాలో విక్రమ్ ఇరవై గెటప్పులలో కనిపించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు మాట్లాడుతూ.. ఈ సినిమాతో పాపులర్ ఇండియన్ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నటుడిగా సినీఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నట్లు ఇదివరకే తెలిపాడు. అంతేగాక ఈ సినిమాలో ఇంటర్పోల్ ఆఫీసర్ పాత్ర కోసం ఇర్ఫాన్ పఠాన్ ఓకే చేసినట్లు చెప్పాడు అజయ్. ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్ర కోసం ఓ స్ట్రాంగ్ పర్సన్ని వెతుకుతుండగా.. ఇర్ఫాన్ పఠాన్ టిక్ టాక్ వీడియో చూసి సెలెక్ట్ చేసినట్లు అజయ్ తెలిపాడు. ఇర్ఫాన్ మొదట్లో కాదన్నా కూడా తర్వాత స్క్రిప్ట్ అంతా విని ఓకే చేసాడట.

మొదటి నుండి కూడా కోబ్రా సినిమాలో విక్రమ్ పాత్రలు ఎన్ని అనేది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్న సందేహం. ఇక కోబ్రాలో ఇర్ఫాన్ పఠాన్ ఉంటాడని తెలిసే సరికి అభిమానులలో అంచనాలు ఓ రేంజికి చేరుకున్నాయి. ఇక తను ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించనున్న విషయాన్నీ తాజాగా ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అంతేగాక కోల్‌కత్తాలో జరిగిన ‘కోబ్రా’ మూవీ షూటింగ్‌ సమయంలో తీసిన ఫొటోను ఇర్ఫాన్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఇక క్రికెటర్‌గా ఎన్నో విజయాలు సాధించిన ఇర్ఫాన్‌ పఠాన్‌ తొలిసారి నటుడిగా కెమెరా ముందుకు రావడంతో అభిమానులలో ఆసక్తి రెట్టింపు అవుతోంది. ఇక ఫిబ్రవరిలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన ఈ సినిమా షూటింగ్ దాదాపు 25% పూర్తయిందట. ఇప్పటికే ఓ సాంగ్ కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.