Begin typing your search above and press return to search.

అతను అసలైన ఇంటర్నేషనల్ స్టార్..

By:  Tupaki Desk   |   4 March 2016 3:30 PM GMT
అతను అసలైన ఇంటర్నేషనల్ స్టార్..
X
ఒకప్పుడు మన ఇండియన్ యాక్టర్స్ ఎవరైనా హాలీవుడ్ సినిమాలో ఓ రెండు నిమిషాలు కనిపించినా గొప్పగా చెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడు మనోళ్లు హాలీవుడ్ మూవీస్ లో ఫుల్ లెంగ్త్ రోల్స్ చేస్తున్నారు. దీపికా పదుకునే ‘ట్రిపుల్ ఎక్స్’ సినిమాలో హీరోయిన్ పాత్రే పోషిస్తోంది. బ్రాడ్ పిట్ సరసన కూడా ఓ సినిమాకు ఆమెను కన్సిడర్ చేస్తున్నారు. దీపిక కంటే ముందు అంతర్జాతీయ సినిమాల్లో ఇండియన్ జెండా ఎగరేసిన నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఆయన ఇప్పటికే అరడజను దాకా హాలీవుడ్ సినిమాలు చేశారు. అందులో లైఫ్ ఆఫ్ పై, జురాసిక్ వరల్డ్ లాంటి ఫేమస్ సినిమాలున్నాయి.

తాజాగా ఇర్ఫాన్ కు మరో ఇంటర్నేషనల్ మూవీలో అవకాశం వచ్చింది. బంగ్లాదేశీ బేస్డ్ ఫిలిం మేకర్ ముస్తఫా సర్వార్ దర్శకత్వంలో ‘నో బెడ్ ఆఫ్ రోజెస్’ అనే సినిమా చేయడానికి ఓకే చెప్పాడు ఇర్ఫాన్. ఇందులో ఆయనే ప్రధాన పాత్రధారి. కొందరు హలీవుడ్ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. ‘‘నాకు చాలా బలమైన స్క్రిప్టులంటే ఇష్టం. ముస్తఫా గురించి చాలా తెలుసుకున్నా. నన్ను తన సినిమా గురించి అడిగాక తన ‘యాంట్ స్టోరీ’ సినిమా చూశా. అద్భుతంగా అనిపించింది. అందుకే వెంటనే ‘నో బెడ్ ఆఫ్ రోజెస్’కు ఓకే చెప్పా’’ అన్నాడు ఇర్ఫాన్. ఇటీవలే ఇర్ఫాన్ ఇంగ్లిష్-జపనీస్ టెలివిజన్ షో ఒకదాని షూటింగులో పాల్గొని ఇండియాకు రావడం విశేషం. అతడి కోసం ఫ్రాన్స్ ఫిలిం మేకర్స్ కూడా ట్రై చేస్తున్నారట. మొత్తానికి ఇండియా నుంచి వచ్చిన అసలు సిసలు ఇంటర్నేషనల్ స్టార్ ఇర్ఫాన్ ఖానే అని చెప్పాలి.