Begin typing your search above and press return to search.

ప్రియుడి కౌగిలిలో స్టార్ డాట‌ర్ త‌న్మ‌యం!

By:  Tupaki Desk   |   26 Jan 2022 2:30 AM GMT
ప్రియుడి కౌగిలిలో స్టార్ డాట‌ర్ త‌న్మ‌యం!
X
బాలీవుడ్ న‌టుడు అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్-ఫిట్నెస్ ట్రైన‌ర్ నుపుర్ శిఖ‌రే తో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది వాలైంటెన్స్ వీక్ లో ఈ జంట ప్రేమ‌లో ఉన్న‌ట్లు అధికారికంగా వెల్ల‌డించారు. స్నేహితులుగా మొద‌లైన ప్ర‌యాణం ప్రేమవ‌ర‌కూ దారి తీసింది. ప్రామిస్ డే సంద‌ర్భంగా నుపుర్ తో క‌లిసి స‌న్నిహితంగా ఉన్న ఫోటోల్ని ఐరా ఖాన్ షేర్ చేసి త‌మ మ‌ధ్య బాండింగ్ ని రివీల్ చేసింది. అప్ప‌టి నుంచి ఇన్ స్టా వేదిక‌గా ఫోటోల్ని షేర్ చేస్తుంది. తాజాగా ప్రియుడి కౌగిలిలో సేద‌దీరుతున్న ఇరాఖాన్ ఆఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఇరా ఖాన్ రెండ్ అండ్ వైట్ బ్లౌజు ధ‌రించింది. దానికి కాంబినేష‌న్ గా వైట్ శారీని క‌ట్టుకుంది. చీర‌క‌ట్టు చాలా రేర్ క‌నుక కొత్త చీర అంత‌గా కుదురుకోలేదు. ఇక త‌న‌ని వెన‌క నుంచి కౌగిలించుకున్న ప్రియుడు నుపుర్ క్యాజువ‌ల్ ప్యాంట్..ష‌ర్టు ధ‌రించి ఉన్నాడు.

ఇరాఖాన్ ని వెనుక నుంచి ఘాడంగా కౌగిలించుకున్న ఫోటో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. ఆ ఫోటోలో ఇరాఖాన్ త‌ల్లి రీనా ద‌త్తా కూడా ఉన్నారు. జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉందంటూ నెటి జ‌నులు కామెంట్లు చేస్తున్నారు. ఇరాఖాన్ ... అమీర్ ఖాన్-రీనా ద‌త్ ల కుమార్తె. అమీర్ మొద‌టి భార్య రీనా. ఆమెతో విడాకులు అనంత‌రం కిర‌ణ్ రావ్ ని పెళ్లి చేసుకున్నారు. ఇటీవ‌లే కిర‌ణ్ రావ్ తో కూడా విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇరా ఖాన్ నుపుర్ శిఖ‌ర్ కంటే ముందు మిషాల్ అనే వ్య‌క్తిని ప్రేమించింది. అత‌నితో కొన్నాళ్ల డేటింగ్ అనంత‌రం మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో బ్రేక‌ప్ చెప్పింది.

అటుపై అమీర్ ట్రైన‌ర్ నుపుర్ శిఖ‌రే తో ఇరాఖాన్ ప్రేమ‌లో ప‌డింది. అమీర్ తో విడాకుల త‌ర్వాత ఇరా ఖాన్ త‌ల్లి వ‌ద్ద‌నే ఉంటోంది. బ్యూటీ బాలీవుడ్ లో లాంచ్ అవ్వాల‌ని వెయిట్ చేస్తోంది. అది కెమెరా ముందా వెన‌కా అన్న‌ది క్లారిటీ రావాల్సి ఉంది. సోష‌ల్ మీడియాలో ఇరా ఖాన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. నిత్యం ఇన్ స్టాలో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు ప్రియుడితో రొమాంటిక్ ఫోటోల‌ను షేర్ చేస్తోంది.