Begin typing your search above and press return to search.

#లాక్ డౌన్.. ప్రియుడి సాన్నిహిత్యంలోనే స్టార్ డాట‌ర్ కు సాంత్వ‌న‌

By:  Tupaki Desk   |   9 April 2021 8:00 AM IST
#లాక్ డౌన్.. ప్రియుడి సాన్నిహిత్యంలోనే స్టార్ డాట‌ర్ కు సాంత్వ‌న‌
X
బాలీవుడ్ లో న‌ట‌వార‌సుల వెల్లువ‌లో అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ కూడా న‌టిగా తెరంగేట్రం చేస్తారా? అంటూ అభిమానులు సందిగ్ధ‌త‌ను వ్య‌క్తం చేయ‌గా.. తాను కెమెరా వెన‌క ప‌నిని ఇష్ట‌ప‌డ‌తాన‌ని అన్నారు ఇరా. త‌న అభిరుచి మేర‌కు ర‌చ‌న ద‌ర్శ‌క‌త్వ శాఖ‌పైనా ఇరా ప‌ట్టు సంపాదిస్తోంది. అయితే గ‌త ఏడాది కాలంగా ఇరా ఖాన్ త‌న బాల్యం గురించి అమ్మా నాన్న విడిపోయాక ఒంట‌రి త‌నం గురించి ఏదీ దాచుకోకుండా సోష‌ల్ మీడియాల్లో ఓపెన‌వ్వ‌డం విస్మ‌య‌ప‌రిచింది.

తాను బాల్యంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాన‌ని ఒకానొక ద‌శ‌లో లైంగిక వేధింపులు కూడా ఎదుర్కొన్నాన‌ని బ‌హిరంగంగా చెప్పి షాకిచ్చారు. త‌న శ‌రీర ఛాయ గురించి విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయ‌ని తాను దానికి ఎంతో ఎమోష‌న్ అయ్యాన‌ని కూడా ఇరా ఖాన్ ఇంత‌కుముందు తెలిపారు.

త‌న లైఫ్ మ‌నుగ‌డ జీవన విధానం అభిరుచులు త‌న ఇష్టాలు క‌ష్టాలు ప్ర‌తిదీ సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు ఇరా. బాల్యంలో ఒక సూప‌ర్ స్టార్ కుమార్తె ఇన్ని క‌ష్టాల్ని వేద‌న‌ల్ని అనుభ‌వించారా? అంటూ షాక‌య్యారు.

అలాగే ఇరా ఖాన్ త‌న బ‌రువు త‌గ్గేందుకు డాడీ అమీర్ ఖాన్ జిమ్ కోచ్ నూపుర్ శిఖారేని నియ‌మించుకున్న సంగ‌తి తెలిసిందే. అత‌డితో ప‌రిచ‌యం ప్రేమ‌గా మారాక ఆ విష‌యాన్ని కూడా ఇరా ఖాన్ దాచ‌లేదు. ప్ర‌స్తుతం ఇరా ఖాన్ -నూపుర్ జంట అన్యోన్య‌త అభిమానుల్లో నిరంత‌రం హాట్ టాపిక్.

ఇంత‌కుముందు లాక్ డౌన్ స‌మ‌యంలో ఈ జంట సాన్నిహిత్యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. తాజాగా ముంబైలో సెకండ్ వేవ్ సంద‌ర్భంగా లాక్ డౌన్ విధించ‌డంతో మ‌రోసారి స్వీయ‌నిర్భంధంలో ఉన్నామ‌ని ఇరా ఖాన్ తెలిపారు. నూపూర్ తో క‌లిసి ఉన్న ఫోటోల్ని షేర్ చేశారు. ఇటీవ‌లే అమీర్ ఖాన్ కరోనా భారిన పడిన సంగ‌తి తెలిసిందే. త‌న తండ్రి చికిత్స‌తో కోలుకుంటున్నార‌ని ఇరా ఖాన్ తెలిపారు.

అమీర్ మొదటి భార్య రీనా దత్తా చిన్న కూతురు ఇరా. ఇరా సంగీతంలో ప‌ట్ట‌భ‌ద్రురాలు కాగా.. ఆమె సోదరుడు జునైద్ తరచూ తన తండ్రికి చిత్రనిర్మాణంలో సహాయం చేస్తాడు. ఇరా దర్శకత్వం వహించిన యూరిపిడెస్ మెడియా థియేట్రికల్ రిలీజ్ గురించి తెలిసిన‌దే. హాజెల్ కీచ్ ఇందులో నామమాత్రపు పాత్రలో నటించారు. అమీర్ ఖాన్ మొద‌టి భార్య నుంచి విడిపోయాక‌.. త‌న స‌హాయ‌కురాలు.. చిత్రనిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఆజాద్ అనే కుమారుడు ఉన్నారు.