Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ డాటర్ ఫిట్నెస్ కోచ్ తో ప్రేమాయణం!

By:  Tupaki Desk   |   25 Nov 2020 9:00 AM IST
సూపర్ స్టార్ డాటర్  ఫిట్నెస్ కోచ్ తో ప్రేమాయణం!
X
బాలీవుడ్​ అగ్రనటుడు అమీర్​ఖాన్​ కూతురు ఇరా ఖాన్​.. ఫిట్​నెస్​ కోచ్​తో ప్రేమలో పడ్డట్టు సమాచారం. ఇరాఖాన్​ గతంలో మిషాల్​ కృపలానిని ప్రేమించింది. కానీ గత ఏడాది డిసెంబర్​లో మిషాల్​ కృపలానికి బ్రేకప్​ చెప్పింది. మిషాల్​తో ఆమె రెండేళ్లపాటు రిలేషన్​షిప్​ కొనసాగించింది. కానీ వివిధ కారణాల వల్ల వాళ్లు విడిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా ఆమె అమిర్​ఖాన్​ ఫిట్​నెస్​ కోచ్​తో ప్రేమాయణం నడుపుతున్నట్టు టాక్​. నుపూర్ శిఖారే .. అమీర్​ఖాన్ ​కు ఫిట్​ నెస్​ కోచ్ ​గా పని చేస్తున్నారు. అయితే లాక్ ​డౌన్​ సమయం లో నుపూర్​ తో ఇరాకు ప్రేమ చిగురించిందట.

వీళ్లిద్దరూ కలిసి ఇటీవల మహాబలేశ్వర్ లోని అమీర్ ఖాన్ ఫామ్ హౌస్ లో కొన్నిరోజుల పాటు గడిపారట. ఇరా తన ప్రేమవిషయాన్ని తల్లి రీనా దత్తాకు చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే ఇరా ఓసారి బ్రేకప్​ పడటం తో ఈ సారి మీడియాకు ఆమె వార్తలు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నదట. నూపూర్ శిఖారే చాలా నైపుణ్యం ఉన్న ఫిట్​నెస్​ కోచ్​. ఆయన పదేళ్లపాటు సుష్మితా సేన్​కు గా ఫిట్​నెస్​ కోచ్​గా వ్యవహరించాడు. ప్రస్తుతం అమీర్​ఖాన్​కు ఫిట్​నెస్​ కోచ్​గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో అమీర్​ కూతురితో పరిచయం అయ్యింది. ఈ పరిచయం క్రమంగా ప్రేమకు దారితీసింది.

ఇటీవల ఇరా.. తన ప్రియుడితో కలిసి దివాళి వేడుకలను జరుపుకుంటున్న ఓ ఫొటోను కూడా పోస్ట్​ చేశారు. మహిళలపై జరుగుతున్న లైంగికవేధింపులపై కూడా ఆమె గళమెత్తారు. తాను 14 ఏళ్ల వయస్సులోనే లైంగిక వేధింపులకు గురయ్యానని మీడియాతో చెప్పారు. డిప్రెషన్​పై కూడా ఆమె పలుమార్లు తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇరా ప్రస్తుతం ఓ వెబ్​సీరిస్​కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో యువరాజ్​సింగ్​ భార్య హాజెల్​ కీచ్​ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.